Monday, April 29, 2024

గాడిదపై కొత్త అల్లుని స్వారీ

- Advertisement -
- Advertisement -

Donkey

 

ఔరంగాబాద్ : మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని ఒక గ్రామంలో హోలీ పండగ సందర్భంగా ఒక సంప్రదాయాన్ని గత 90 ఏళ్లుగా పాటిస్తున్నారు. అది కొత్త అల్లుడిని గాడిదపై స్వారీ చేయించడం. స్వారీ పూర్తయిన తరువాత ఆ కొత్త అల్లుడు కోరుకున్న వస్త్రాలను కానుకగా అందిస్తారు. జౌరంగాబాద్‌కు 125 కిమీ దూరంలో బీడి కెజ్ తహశీల్ పరిధిలో విడ గ్రామం ఉంది. మంగళవారం ఆ గ్రామం కొత్త అల్లుడిని గాడిదపై స్వారీ చేయించారు. ఈ వేడుకను చూడడానికి దూర గ్రామాల నుంచి కూడా జనం వచ్చి నిరీక్షిస్తుంటారని గ్రామస్థుడు అంగద్ దేతే చెప్పారు. అల్లుడిని మూడు రోజుల పాటు గ్రామంలో ఉంచుతారు. అతను ఈ వేడుక తప్పిపోకుండా కనిపెడతారు.

ఈ ఏడాది గ్రామస్థులు దత్తాదేశ్‌ముఖ్ అనే స్థానిక పాత్రికేయుడిని ఈ వేడుక చూడడానికి ఆహ్వానించారు. 90 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన పేరైన వ్యక్తి ఆనందరావు దేశ్ ముఖ్ ఈ సంప్రదాయాన్ని 90 ఏళ్ల క్రితం ప్రారంభించారని తన అల్లుడిచే గాడిద స్వారీ చేయించారని, అదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోందని దేతే చెప్పారు. కొత్తగా పెళ్లైనప్పుడు తాను కూడా ఈ సంప్రదాయాన్ని పాటించానని దేతే తెలిపారు. గాడిదపై స్వారీ గ్రామం మధ్యలో ప్రారంభమై హనుమాన్ ఆలయం వద్ద ఉదయం 11 గంటలకు గ్రామస్థులు కొత్త అల్లుడు కోరుకున్న వస్త్రాలు కానుకగా అందించడంతో వేడుక పరిసమాప్త మౌతుంది.

Son in law were riding on the Donkey
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News