Friday, May 3, 2024

ఖమ్మంను సంపూర్ణంగా అభివృద్ధి చేసే రాజకీయాలనుంచి తప్పుకుంటా

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ఖమ్మం నగరంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిన తరువాత ఖమ్మం నగరానికి ఇక నా అవసరం లేదు అనుకున్న రోజే తాను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.తాను ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే చదువుకోని ఇక్కడే సైకిళ్ళ మీద తిరిగిన ఖమ్మం నగరాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతోనే రాజకీయాలకు వచ్చానని ఇప్పటి వరకు ఎంతో చేశానని ఇంకా చేయాల్సిన బృహత్తర కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని అవి పూర్తియన రోజు ఇక ఖమ్మంతో నా అవసరం లేదనుకున్న రోజే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం పట్టణ ప్రగతి కార్యక్రమం పురస్కరించుకొని ఖమ్మం నగర కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నగరంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి యావత్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో రాష్ట్రప్రభుత్వం ఖమ్మం అభివృద్ధికి కోట్లాది రూపాయలు విడుదల చేసిందన్నారు. 75 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం ఏడేళ్లలోనే సాధ్యమైందన్నారు. ఖమ్మం ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాడు ఖమ్మం నగరం అత్యంత దారుణమైన దుస్థితిలో సరైన రోడ్లు లేక, తాగునీరు రాక.. ట్యాంకర్ల ద్వారా తాగునీరు, ఇరుకైన దారులు, రోడ్ల మీద చెత్త చెదారంతో దుర్గంధభరితంగా ఉండేదన్నారు.

ముఖ్యంగా ఖమ్మం త్రీ టౌన్ లో తాగునీటికి తీవ్ర ఎద్దడి ఉండేదని దానిని నేడు శాశ్వతంగా పరిష్కరించగలిగామని గుట్టల బజార్‌లో రూ.3.48 కోట్లతో నిర్మించిన 23 లక్షల లీటర్ల సామర్థ్యం గల బాహుబలి ట్యాంక్‌తో మొత్తం గృహాలను నల్లా కనెక్షన్లు ఇచ్చి త్రాగునీరు అందిస్తున్నామని అన్నారు. సొంత ఇంటిని శుభ్రం చేసుకున్న మాదిరిగా ఒక్కొక్కటిగా సమస్యలను అధిగమిస్తూ, అభివృద్ధి చేసుకుంటూ నేడు ఖమ్మం రాష్ట్రానికే ఆదర్శంగా నిలువటం గర్వంగా ఉందన్నారు. నేడు రాష్ట్రంలో ఖమ్మం ఒక రోల్ మోడల్‌గా నిలిపామని పేర్కొన్నారు. ఖమ్మం నియోజకవర్గం ఈ విధంగా అభివృద్ధి జరిగిందంటే మంత్రి కెటిఆర్ అండ, సిఎం కెసిఆర్ చొరవతో సాధ్యమైంది అని మంత్రి పువ్వాడ తెలిపారు.

మున్సిపల్ కార్మికుల సేవలను గుర్తిస్తూ సిఎం కెసిఆర్ సఫాయి అన్నా సలాం అన్న, సఫాయి అమ్మ సలాం అమ్మ అనే నినాదాలు తీసుకొచ్చారని చెప్పారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఖమ్మం నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు. ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పాటుపడుతున్న మున్సిపల్ కార్మికులకు, అధికారులకు, పాలకమండలికి, కమిషనర్, కలెక్టర్‌కు మంత్రి అభినందనలు తెలిపారు. జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ మాట్లాడుతూ సఫాయి కర్మచారుల్ని ముందుపెట్టి, పట్టణ ప్రగతి దినోత్సవం చేపడుతున్నట్లు తెలిపారు. కోవిడ్ మహమ్మారి కాలంలో ప్రాణాలకు తెగించి, ఏమాత్రం భయపడక, పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారన్నారు. మున్సిపల్ కార్యాలయంలో సఫాయి అన్న.. సలాం అన్న.. సఫాయి అమ్మ.. సలాం అన్న.. స్లోగన్ తో విగ్రహాలు ఏర్పాటుచేసినట్లు, సఫాయి కార్మికుల సేవల గుర్తింపుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

గత 5-6 సంవత్సరాల్లో సఫాయి కార్మికుల వేతనాలు రెట్టింపు అయినట్లు ఆయన అన్నారు. నగరంలో రూ.40 కోట్లతో లకారం ట్యాంక్ బండ్ అభివృద్ధి, రూ. 100 కోట్లతో గోళ్లపాడు ఛానల్ సుందరీకరణ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ మున్సిపల్ వినూత్న మౌలిక సదుపాయాల కల్పన విభాగంలో రాష్ట్రంలో ఉత్తమ నగరంగా ఎంపిక కాబడి, శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ అవార్డు పొందనున్నదని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్‌లు కర్నాటి కృష్ణ, బిక్కసాని ప్రశాంత లక్ష్మి, బిజి క్లెమెంట్, మక్బూల్, దొన్వాన్ సరస్వతి, పగడాల శ్రీవిద్య, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, డి ఇ రంగారావు, పలువురు బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు అంతకుముందు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News