Monday, May 6, 2024

కెసిఆర్ పాలనలో మున్సిపాలిటీల అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : కెసిఆర్ పాలనలో మున్సిపాలిటీలు ఎంతో గోప్పగా అభివృద్ధ్ది చెందాయని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కొండా భూదేవి గార్డెన్‌లో జరిగిన పట్టణ ప్రగతి లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ హాయాంలో సఫాయి కార్మికుల జీతం రూ 6,800 మాత్రమే ఉండేదని ఆ జీతం కూడా ఐదారు నెలలకు ఒక్కసారి వచ్చేదని గుర్తు చేశారు. కార్మికులను ఆనాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. అదే సిఎం కెసిఆర్ 6,800 ఉండే సఫాయి కార్మికుల జీతాన్ని 15,800కు పెంచారన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా కార్మికులకు బీమా సౌకర్యాన్ని కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

సఫాయి కార్మికులు , మున్సిపల్ సిబ్బంది ప్రజలందరి సహకారంతోనే స్వచ్ఛ సిద్దిపేటగా మార్చుకున్నామన్నారు. సిద్దిపేట అభివృద్ధ్దిపేటతో పాటు శుద్దిపేటగా మారిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లను అభివృద్ధ్ది చేశామన్నారు. అలాగే పార్కులను తలపించేలా వైకుంఠదామాలను తీర్చిదిద్దామన్నారు. చెత్తతో గ్యాస్ తయారు చేసి అదాయాన్ని సమకూర్చుకున్న ఏకైక మున్సిపాలిటీ సిద్దిపేటే అన్నారు.

దేశంలోనే రుతుప్రేమ కార్యక్రమాన్ని సిద్దిపేటలోనే ప్రారంభించుకున్నామన్నారు. ప్రజలకు కావల్సిన ఒక్కొక్కటిని దశల వారిగా ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్త బుట్టలోనే వేసే సంస్కృతిని సిద్దిపేట అందిస్తుందన్నారు. 150 కోట్లతో సిద్దిపేట రంగనాయక సాగర్‌ను అద్బుత పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దబోతున్నామన్నారు. సిద్దిపేటకు ఇప్పటికే 22 అవార్డులు వచ్చాయని సిద్దిపేట పేరు లేనిది అవార్డులు ఉండవన్నారు. తడి, పోడి, హనికర చెత్తగా వేరు చేసి మున్సిపల్ వాహానాలకు అందిస్తూ ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలుస్తున్నది సిద్దిపేట ప్రజలేనన్నారు.

ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సిద్దిపేటలో జరిగిన అభివృద్దిని చూసి నేర్చుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. సిద్దిపేట స్వచ్చబడి స్ఫూ ర్తితో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో స్వచ్ఛ బడులు ప్రారంభిస్తామని పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ ఇటీవల జరిగిన సమావేశంలో చెప్పారని గుర్తు చేశారు. సిద్దిపేటలో ఏ మంచి కార్యక్రమం మొదలైన అది ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సిద్దిపేటకు నలువైపులా నుండి వచ్చే వారికి పచ్చని చెట్లు స్వాగతం పలుకుతాయన్నారు. డాక్టర్ డిఎన్. స్వామి స్వచ్ఛబడిలో సేవలు అందిస్తూ స్వచ్ఛ సిద్దిపేటకు ఎంతో కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. అనంతరం కార్మికులను మంత్రి చేతుల మీదుగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, ప్రముఖ వైద్యులు డిఎన్, స్వామి, ప్రజాప్రతినిధులు , నాయకులు కడవేర్గు రాజనర్సు, జంగిటి కనకరాజు, మ చ్చ వేణుగోపాల్‌రెడ్డి, కొండం సంపత్‌రెడ్డి, అత్తర్ పటేల్, కెమ్మసారం ప్రవీణ్‌కుమార్, వజీరోద్దిన్, మొయిస్, సద్ది నాగరాజు రెడ్డి, వంగ తిరుమల్ రెడ్డి, మల్లికార్జున్, రియాజ్, శ్రీనివాస్, ఎల్లం, నర్సింలు , శ్రీలత , కవిత, శోభారాణి, ఫహిమాబేగం, నాజీయా తబస్సుం, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News