Saturday, April 27, 2024

విపత్తులు నేర్పిన గుణపాఠం..

- Advertisement -
- Advertisement -

Heavy rains in Telangana

మన దేశంలో విద్య, వైద్యానికి ప్రజలు వెచ్చించే వ్యయం పేదరికానికి కారణమవు తున్నది. ప్రపంచలో అభివృద్ధి చెందిన దేశాలువారి వార్షిక బడ్జెట్‌లో సరాసరి 19 శాతం వెచ్చిస్తున్నాయి. దిగువ మధ్య దేశాల సగటు 15.1 శాతం కన్నా తక్కువ ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి 1000 మంది రోగులకు ఒక వైద్యుడు ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల కన్నా మెరుగ్గా ఉంది. అలా జర్మనీలో 4.3, ఆస్ట్రేలియాలో 3.7 కాని మన దగ్గర 1446 మంది రోగులకు ఒక వైద్యుడు చొప్పున ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వమే చెప్పింది.

అన్నపూర్ణగా పేరొందిన మనదేశం, ఏడు దశాబ్దాల ప్రజాపాలన ప్రాయంలో నేడు దారితప్పుతున్న పాలన విధానాల మూలంగా పేదరికం దాని కవలలైన ఆకలి, అనారోగ్యం, అసమానతలు, వైద్యం, విద్య, వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధి మహిళాభ్యుదయ రంగాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనేలా ఉంది. ప్రపంచ ఆకలి సూచిలో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ( జి.హెచ్.ఐ 2020) నివేదిక ప్రపంచంలోని 107 దేశాల్లో మన దేశం 94వ స్థానంలో ఉంది. తీవ్రమైన ఆకలి బాధలున్న దేశాల జాబితాలో నిలిచింది. పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్థాన్ సైతం మనకన్నా మెరుగైన స్థానంలో ఉండడం మన పాలకుల పని తీరు విస్మయానికి గురి చేస్తున్నది. దేశ పౌరులందరికీ సరిపడేలా భారీగా ఆహార నిల్వలున్నప్పటికీ ఆహార భద్రతను కల్పించలేని పాలకుల వైపల్యాలు, పర్యవేక్షణ లేమి, విచ్చలవిడి అవినీతి ఈ స్థితికి కారణం కాదా? వీటికి తోడుగా భూమి ఆకాశం ఏకధాటిగా ఉన్నట్టుండి చిల్లుపడి కుంభవృష్టిలా జల విలయం సృష్టించిన మూలంగా ప్రపంచానికి అన్నం పెట్టిన రైతు పంట మునిగింది. ఆ రైతును ఆదుకోవాల్సి ఉంది.
అలాగే పల్లె, పట్నం, నగరం అనే తేడా లేకుండా ఆస్తి, ప్రాణనష్టంతో పాటు ఎక్కడికక్కడ బురద, మురుగు మేటలు వేయడం ద్వారా వ్యాపిస్తున్న దుర్గంధంతో వర్ష బీభత్స తీవ్రత అద్దం పడుతున్నది. మరో వైపు పొంచి వున్న అంటురోగాలు, విష జ్వరాలు, సాంక్రమిక వ్యాధులు విజృంభిస్తాయని ప్రజానీకం ప్రాణాలు గుప్పిట పెట్టుకొని బెంబేలెత్తిపోతున్నారు. ఇంకోపక్క కోవిడ్ -19 ప్రళయం నుండి తేరుకోలేకపోతిమి. ప్రకృతి కన్నెర్రకు తోడుగా దేశాన్ని అన్ని రంగాలను అథఃపాతాళానికి నెట్టిన మహమ్మారి నుండి పాలకులు, ప్రజలు ప్రణాళికబద్ధమైన అభివృద్ధిలో ముందుకు వెళ్లాలి.


విద్య, వైద్య రంగాలకు నిధులు పెంచాల్సిన ఆవశ్యకతను గుర్తించాలి. ఇలాంటి విపత్తుల నుండి బయటపడిన చిన్న చిన్న దేశాల నుండి మన పాలకులు స్ఫూర్తి పొందాల్సి ఉందనే కఠిన వాస్తవాన్ని గ్రహించాలి. ప్రపంచ జనాభాలో 17 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మన దేశం అంతర్జాతీయంగా వివిధ రకాల వ్యాధుల భారంలో అయిదో వంతున బారినపడాల్సి రావడం బాధాకరం. మన దేశం ఏటా ఆరోగ్యానికి బడ్జెట్‌లో నాలుగు శాతానికి మించడం లేదని ఆక్స్‌ఫామ్ ‘అంచనాల్లో తేలింది. మరోవైపు అసమానతల తగ్గింపు సూచిలోని 158 దేశాల్లో 129వ స్థానానికి పరిమితమవ్వడం మన బేలతనాన్ని చాటుతున్నది.
ఆరోగ్య రంగానికి మన ఇరుగు పొరుగు దేశాల కేటాయింపులు మనకన్నా శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ సైతం మెరుగ్గా ఉన్నాయని తెలుస్తున్నది. మన దేశ జనాభాలో సగం మంది కే అత్యవసర వైద్య సేవలు అందుతున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. వివిధ దేశాల్లో పౌరుల సొంత ఆరోగ్యానికి సగటున 18 శాతం ఖర్చు చేస్తుంటే మన దేశంలో అనారోగ్యానికి అయ్యే ఖర్చులో 70 శాతంగా భరించాల్సి వస్తుంది.
మన దేశంలో విద్య, వైద్యానికి ప్రజలు వెచ్చించే వ్యయం పేదరికానికి కారణమవు తున్నది. ప్రపంచలో అభివృద్ధి చెందిన దేశాలువారి వార్షిక బడ్జెట్‌లో సరాసరి 19 శాతం వెచ్చిస్తున్నాయి. దిగువ మధ్య దేశాల సగటు 15.1 శాతం కన్నా తక్కువ ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి 1000 మంది రోగులకు ఒక వైద్యుడు ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల కన్నా మెరుగ్గా ఉంది. అలా జర్మనీలో 4.3, ఆస్ట్రేలియాలో 3.7 కాని మన దగ్గర 1446 మంది రోగులకు ఒక వైద్యుడు చొప్పున ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. మన దేశంలో గ్రామీణ జనాభా సుమారు 60 శాతంగా ఉంటున్నందువల్ల వారికి వైద్యం అందించే వైద్యులు మాత్రం 70 శాతం మంది పట్టణాల్లోనే ఉంటున్నారు. ఈ కారణంగా వైద్య సేవలందక ఏటా మన దేశంలో 24 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుస్తుంది. కోవిడ్- 19 సంక్షోభం మరోవైపు ప్రకృతి విపత్తుల నుండి గుణపాఠం నేర్చుకొని వైద్య, విద్యారంగాలపై అరకొర కేటాయింపుల నుండి విముక్తి కలిగించి భారీ బడ్జెట్ కేటాయింపులతో పాటు సక్రమంగా ఖర్చు చేయడంపైనే మన అసమానతలను తగ్గి స్తూ , వైద్య , విద్య రంగాలను పూర్తిగా ప్రభుత్వాధీనంలోకి తీసుకొని ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించుకోవాల్సి ఉంది.
దేశంలో ‘ప్రకృతి విపత్తు’ ల ద్వారా పాలకులు, పాలితులు గుణపాఠం నేర్పిన అనుభవంతో విద్య, వైద్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచేలా.. పంచాయతీ నుండి పార్లమెంట్ దాకా ప్రజాస్వామ్య పద్ధతిలో తీర్మానాలు చేయాలి. ఈ చైతన్యానికి ప్రాచుర్యం పెంచేలా ప్రచార, -ప్రసార సాధనాలు వీటికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలి. అధికారం కట్టబెట్టిన ప్రజల ఆరోగ్యం, విద్య కన్నా మిన్న ఏదీ కాదనేలా దృఢ అభిప్రాయానికి ప్రతి ఒక్కరూ ఉప్పెనలా మరో పోరును నడపాలి. సంక్షేమ పథకాల పేరుతో కరిమింగిన ఎలగపండులా దారిమళ్లి కరిగిపోతున్న ప్రజాధనం ప్రజల చెంతకు చేరాలి. ప్రజలు విద్య, వైద్యం కన్నా మిన్న ప్రాధాన్యత అంశం ఏదీ కాదు అనేలా కరోనా, ప్రకృతి విపత్తుల బీభత్సం నుండి స్ఫూర్తి పొందాలి.
ప్రజలు, పాలకులు నేటి నుండి ప్రజా ఆరోగ్యం, ప్రభుత్వ విద్య, వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధి మహిళాభ్యుదయ రంగాలపై కేటాయింపుల ప్రాధాన్యత పెరగాలి. గత పాలకుల పాలనా విధానాలు కొంతమేర అభివృద్ధి సాధించినప్పటికీ , అసమానతలు , పేదరికం రూపుమాపలేక పోయిందనేది కాదనలేని నిజం. ఇలా గతం నుండి అనేక విపత్తులు సంభవించినప్పటికీ పాలకులు కొద్ది రోజులు హడావిడి చేసి కళ్లబొల్లి మాటలతో కాలం వెళ్లదీసిన సంగతి అనుభవంలోనే ఉంది. పాలకులు మారినప్పుడల్లా కొత్త కొత్త పథకాలు అందమైన పేర్లతో మారుస్తున్నారు. నిధులు మంచుకొండలా కరిగిపోతూనే ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ప్రజల్లో అసమానతలు తొలగకపోగా, చిన్న చిన్న విపత్తులను కూడా తట్టుకునే ఆర్ధిక శక్తిగానీ, విజ్ఞానంగాని లేదు.
వైద్యానికి, విద్యకు ప్రజలు చేస్తున్న ఖర్చు వలన వారి ఆదాయం తుడిచి పెట్టుకపోవడం జరుగుతున్నది. అప్పులు చేసి వైద్యాన్ని, విద్యను అంగట్లో కొనుక్కుంటున్న విధానాలు మారాలి. ప్రపంచంలో మనకన్నా చిన్న చిన్న దేశాలు నాణ్యమైన విద్యా విధానానికి కేంద్రంగా మారిన ఫిన్‌లాండ్, కరోనా విజృంభణ కష్టకాలంలో ప్రపంచానికి వైద్యులనందించిన క్యూబా వైజ్ఞాన దృక్పథం, దక్షిణ కొరియా స్వల్ప ఆర్ధిక ప్రాణనష్టంతో సాధారణ జీవనం- సాగేలా చేసి, ఆ దేశ సాధారణ ఎన్నికలు నిర్వహించుకున్న దక్షిణ కొరియా పాలన నిబద్ధత, ప్రజల బాధ్యతా విధానాలను నేడు ప్రపంచం అధ్యయనం చేయాలి.
అణుబాంబు దాడుల తర్వాత ఆ బూడిదలోంచి అద్భుతాలు సృష్టిస్తున్న జపాన్ అభివృద్ధి సాధించింది. వైద్యానికి, విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతలను ప్రజలు, పాలకులు గమనించాలి. ప్రజాస్వామ్య విధానంలో పాలన సాగాలి. కార్పొరేటు, పెట్టుబడిదారుల సహజ సంపదలను దోపిడీ నిర్మూలించబడాలి. ఎన్నికల వేళ క్యూలైన్‌లో నిలబడి ఓటు వేసిన ప్రజల ఆరోగ్యం, విద్య, మెరుగైన జీవనం అందించాలనే కనీస బాధ్యతలను మరువరాదు . కార్పొరేట్ల సేవలో మునగడమంటే? ముమ్మాటికి ప్రజాస్వామ్యానికి, ప్రజలకు తీవ్రమైన ద్రోహం చేసినట్లేనని భావించాలి.
దేశంలోని 70 శాతం సంపద ఒక శాతం ధనవంతుల వద్ద కేంద్రీకృతమవ్వడమే ఈ స్థితికి కారణం కాదా! అస్తవ్యస్త విధానాలకు స్వస్తి పలకాలి. రోదసిలో విహరిస్తున్నాం.. అత్యాధునిక యుద్ధ విమానాలను కొంటున్నామని గొప్పలు చెప్పడం కాదు. ఆకలి అలమటించని, వైద్యం, విద్య, వ్యవసాయ , ఉద్యోగం, ఉపాధి, మహిళాభ్యుదయాల్లో పురోగతి సాధించి పౌరులందరూ గౌరవప్రదమైన జీవనానికి భరోసా చేకూర్చేలా ఆధునిక నాగరికత పరిణామక్రమంలో.. ఈ నాటి మన కంటే ! వచ్చే తరానికి అన్ని రంగాల్లో అభివృద్ధిని చూపడం మన బాధ్యత. నేటి మన పాలన, ప్రవర్తనే ఆదర్శం.

మేకిరి దామోదర్
9573666650

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News