Wednesday, May 1, 2024

నగరంలో హిజ్రాల హల్చల్.. పది మంది అరెస్టు

- Advertisement -
- Advertisement -

Hijras Hulchal in Hyderabad

 

హైదరాబాద్ : నగరంలో హిజ్రాల ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. డబ్బులు అడిగి ఇవ్వకపోతే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. బాచుపల్లిలో హిజ్రాలు హల్ చల్ చేశారు. బాచుపల్లి పరిధి ప్రగతినగర్ లో వ్రతం జరుగుతున్న ఇంట్లోకి పది మంది హిజ్రాలు చొరబడి ఇంటియజమాని నుంచి రూ. 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో అక్కడే అర్ధనగ్న ప్రదర్శన చేశారు. చివరకు ఇంటియజమాని హిజ్రాలపై బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పదిమంది హిజ్రాలను అరెస్టు చేసి, వారి నుంచి ఏడు సెల్ ఫోన్లు, రూ.16,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News