Saturday, April 27, 2024

బైక్ ప్రమాదంలో హోంగార్డు మృతి

- Advertisement -
- Advertisement -

Home guard dead in bike accident
అమరావతి: బైక్ పై వెళ్తుండగా అదుపు తప్పి పడి పోవడంతో తీవ్రంగా గాయపడిన హోంగార్డు చికిత్స పొందుతూ చనిపోయిన సంఘటన కడప జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రకాశం జిల్లా సిఎస్ పుర మండలం వి బైలు గ్రామానికి చెందిన సారే శ్రీనివాసులు కానిస్టేబుల్‌గా జాబ్ చేస్తున్నాడు. శ్రీనివాసులు పని నిమిత్తం కడప జిల్లా పోరుమామిళ్లకు బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులను చెన్నైలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 12 రోజుల క్రితం శ్రీనివాసులకు కుమారుడు జన్మించాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉదయగిరి సిఐ గిరిబాబు, ఎస్‌ఐ కిశోర్ బాబు హోంగార్డు మృతదేహానికి నివాళులర్పించారు. శ్రీనివాసులు కుటుంబాన్ని అని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News