Monday, April 29, 2024

పనిమనిషిపై అత్యాచారం చేసిన ఉదయభాను అరెస్ట్

- Advertisement -
- Advertisement -

House owner arrested for sexually assaulting maid

హైదరాబాద్: ఇంట్లో పనికి కుదిరిన మహిళపై అత్యాచారం చేసిన నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…బంజారాహిల్స్‌కు చెందిన పొన్నుగోటి ఉదయభాను(52) గత నెల 17వ తేదీన ఎపిలోని రాజమడ్రికి చెందిన మహిళను వంట, ఇంట్లో పనిచేసేందుకు చేర్చుకున్నాడు. అయితే బాధితురాలిని రెండు వారాలపాటు ప్లాట్‌లో బంధించి భౌతికంగా దాడి చేయడమే కాకుండా అత్యాచారం చేశాడు.

ఈ విషయం బాధితురాలు రాజమండ్రిలో ఉన్న తన కూతురుకు ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు బాధితురాలికి విముక్తి కల్పించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు గతంలో కూడా పలు వివాదాల్లో నిందితుడుగా ఉన్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులతో దురుసుగా ప్రవర్తించేవాడని ఆరోపణలు ఉన్నాయని తెలిసింది. ఉదయభానను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News