Tuesday, May 7, 2024

భారత్ చుట్టూ చైనా సైనిక వలయం

- Advertisement -
- Advertisement -

How changed strategy on dealing with Beijing

వాషింగ్టన్ : భారత్‌ను మరింతగా దిగ్బంధం చేసేందుకు పొరుగుదేశం చైనా యత్నిస్తోంది. అమెరికా రక్షణ వ్యవహారాల ప్రధాన కేంద్రం అయిన పెంటగాన్ వార్షిక నివేదికతో ఈ విషయం స్పష్టం అయింది. భారతదేశానికి చుట్టూ ఉండే పాకిస్థాన్, శ్రీలంక, మయన్మార్ వంటి మొత్తం 12 దేశాలలో తమకు చెందిన మరింత అత్యంత అధునాతన వ్యూహాత్మక స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలని చైనా సంకల్పించింది. ఈ దిశలో చర్యలు కూడా చేపట్టిందని పెంటగాన్ తెలిపింది. ప్రత్యేకించి భారత్‌ను అన్ని దిక్కుల నుంచి కట్టడి చేసే విధంగా ఈ 12 దేశాలను ఎంచుకున్నారు. చైనా సైన్యం పిఎల్‌ఎ నుంచి ఈ దేశాల్లోని స్థావరాల ద్వారా కార్యకలాపాలు సాగించేందుకు, వారి ప్రాజెక్టులు చేపట్టేందుకు, సైనిక శక్తిని పెంపొందింపచేసుకునేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయని పెంటగాన్ ప్రధాన కార్యాలయం తమ నివేదికలో వెల్లడించింది. సరైన వ్యూహాత్మక దూరాలను ఖరారు చేసుకుని నిర్థిష్టంగా కొన్ని దేశాలను ఇరకాటంలోకి నెట్టేందుకు రంగం సిద్ధం చేసుకొంటోందని తెలిపారు. పాక్, శ్రీలంక, మయన్మార్ కాకుండా తమ కీలక సైనిక లేదా వ్యూహాత్మక కేంద్రాల ఏర్పాటుకు చైనా థాయ్‌లాండ్, సింగపూర్, ఇండోనేషియా, యుఎఇ, కెన్యా, సిషిలిస్, టాంజానియా, అంగోలా, తజకిస్తాన్‌ల్లో కూడా కొంత మేరకు పాగా వేయాలని భావిస్తున్నట్లు ఈ నివేదికలో వెల్లడించింది. సైనిక భద్రతా పరిణామాల పేరిట పెంటగాన్ తమ వార్షిక నివేదికను వెలుగులోకి తెచ్చింది. ఇందులో ఈ ఏడాది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సంబంధిత వ్యవహారాలను దీని పర్యవసానాలను ప్రస్తావించారు. దీనిని యుఎస్ కాంగ్రెస్ పరిశీలనకు పంపించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో చైనా నౌకాబలగాలు తిష్టవేసుకుని ఉన్నాయి. వీటికి అదనంగా ఇప్పుడు 12 చోట్ల తమ బలీయమైన స్థావరాలను చైనా ఏర్పాటు చేసుకొంటోందని విశ్లేషించారు. తమ సైనిక బలగాలన్నింటికి ఎప్పటికప్పుడు మద్దతుగా నిలిచే విధంగా అత్యంత భౌగోళిక ప్రాధాన్యత కల ప్రాంతాలను చైనా ఎంచుకుంది.

ఓ వైపు భారతదేశ భద్రతకు చైనా చర్యలు గట్టి సవాలుగా మారుతాయి. అంతేకాకుండా చైనా బలగాల సైనిక చర్యలు, విస్తరించుకుంటున్న వ్యవస్థతో ఏదో ఓ స్థాయిలో అమెరికా సైనిక చర్యలతో ఘర్షణ ఏర్పడుతుందని కూడా అంతేకాకుండా చైనా స్థావరాల బలంతో అమెరికాకు వ్యతిరేక చర్యలకు మద్దతుగా చైనా బలగాలు తేలికగా సమీకరణలకు దిగే వీలేర్పడుతుందని కూడా హెచ్చరించారు. ఇప్పటికే చైనా నమిబియా, వనూవాటూ, సోలోమన్ ఐలాండ్స్ వంటి వాటిని తగు విధంగా ప్రలోభపర్చుకుని తమకు అనుకూలంగా చేసుకుంది. అన్నింటికి మించి చైనా తలపెట్టిన ఒన్ బెల్ట్ ఒన్ రోడ్ (ఒబిఎంఆర్) నిర్మాణం కేవలం ఆ దేశ జాతీయ పునరుజ్జీవ ప్రక్రియలో భాగం అనుకోరాదని, ఇంతకు ముందు చైనాకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపార వాణిజ్య మార్గాల పునరుద్ధరణ అనుకోరాదని, దీని వెనుక ఆ దేశ బలీయమైన అంతర్జాతీయ విస్తరణ కాంక్ష,అంతకు మించిన ప్రపంచ స్థాయి రవాణా పటిష్టత వంటివి అనేకం ఉన్నాయని తెలిపారు. పలు దేశాలను మచ్చిక చేసుకుంటూ చైనా తలపెట్టిన ఈ వాణిజ్య మార్గం, ఈ అనుసంధాన ప్రక్రియతో పలు ఇతర దేశాలకు చేటు వాటిల్లుతుందని తెలిపారు.

How changed strategy on dealing with Beijing

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News