Wednesday, May 1, 2024

నెక్లెస్ రోడ్‌లో ఆవిష్కరణకు సిద్ధమైన పివి విగ్రహం

- Advertisement -
- Advertisement -

Huge statue of PV Narasimha Rao near Necklace Road

మాజీ ప్రధాని పివి నరసింహారావుకు సముచిత గౌరవం
హుస్సేన్‌సాగర్ తీరాన 16 అడుగుల
కాంస్య విగ్రహం
ఈ నెల 28న ఆవిష్కరించనున్న సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ :మాజీ ప్రధాని పివి నరసింహారావుకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం కల్పిస్తోంది. అందులో భాగంగా పివి శత జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నగరం నడిబొడ్డున పివి ప్రతిమతెలుగు జాతి ఖ్యాతిని దేశ నలుమూలలా చాటి చెప్పేలా కాంస్య విగ్రహ ప్రతిమ నెక్లెస్‌రోడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టించనున్నారు. ఈ మేరకు వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఉత్సవాల కమిటీ చైర్మన్ కేశవరావు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే హుస్సేన్ సాగర్ తీరాన అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. ఈ నెల 28న పివి జయంతి సందర్భంగా హుస్సేన్ సాగర్ తీరాన 16 అడుగుల పివి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ విగ్రహాన్ని సిఎం కెసిఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో పాటు పలువురు హాజరుకానున్నారు.

నెక్లెస్‌రోడ్డు పేరు పివి నరసింహారావు మార్గ్‌గా మార్పు

ప్రస్తుతం నెక్లెస్‌రోడ్డును పివి నరసింహారావు మార్గ్‌గా మార్చారు. పివి నరసింహారావు జన్మ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈనెల 28వ తేదీన పివి కాంస్య విగ్రహాన్ని సిఎం కెసిఆర్ ఆవిష్కరించనున్నారు. పివి విగ్రహం కోసం ఒక పీఠం నిర్మాణం కోసం హెచ్‌సిడిఎ జెసిబీలను ఉపయోగించి స్థలాన్ని తవ్వింది. రెండు వారాల వ్యవధిలో పివి కాంస్య విగ్రహం రూపుదిద్దుకుంది. సుమారు 27 లక్షల రూపాయల ఖరీదైన కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసింది. కాగా, మాజీ ప్రధాని పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన పేరును పెట్టాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించిన నేపథ్యంలోనే నెక్లెస్‌రోడ్ పేరు మారుస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. నెక్లెస్ రోడ్డు పేరును పివి నరసింహారావు మార్గ్‌గా మారుస్తూ అధికారులు చర్యలు చేపట్టారు. 23 ఏళ్ల తర్వాత నెక్లెస్‌రోడ్డు పివి నరసింహారావు మార్గ్‌గా రూపాంతరం చెందింది. అప్పట్లో ట్యాంక్‌బండ్ ప్రాంతాన్ని అభివృద్ది చేసి నెక్లెస్‌రోడ్డుగా 1998 మే 28న ప్రారంభించారు. ఇక నుంచి నెక్లెస్ రోడ్డుగా ముద్ర పడినా అధికారికంగా మాత్రం పివి నరసింహారావు మార్గ్‌గా దీనిని పిలవనున్నారు.

17 రోజులు… 15 మంది కళాకారుల కృషి

16 అడుగుల ఎత్తు 2 టన్నుల బరువుతో పసిడి వర్ణంతో కాంస్య విగ్రహ ప్రతిమ మెరుగులు దిద్దుకుంటోంది. తొలిసారిగా లేజర్ సాంకేతికతో, అమెరికా నుంచి తెప్పించిన యంత్రాలతో పివి విగ్రహం నమూనా తయారైంది. ఈ విగ్రహం నిర్మాణానికి ప్రభుత్వం దాదాపు రూ. 27 లక్షలు ఖర్చు చేసింది. కేవలం 17 రోజుల్లో 15 మంది కళాకారులు అహర్నిశలు కృషి చేసి విగ్రహాన్ని పూర్తి చేశారు. నెక్లెస్ రోడ్డులో పివి జ్ఞాన భూమి ఉండటంతో ఆ రోడ్డును పివి నరసింహారావు మార్గ్‌గా ఇప్పటికే ప్రభుత్వం మార్చింది. రహదారి ప్రారంభంలో హుస్సేన్‌సాగర్ తీరాన పివి విగ్రహ ఏర్పాటుకు ఆధునికీకరణ పనులు చేస్తున్నారు. ఆకర్షణీయంగా పివి విగ్రహం ముందు భాగంలో విగ్రహం వద్దకు వెళ్లేలా మెట్లు, పివి మార్గ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌ను కలుపుతూ విగ్రహం వెనుక నుంచి నడిచి వెళ్లేలా దారిని ఏర్పాటు చేశారు. నెక్లెస్ రోటరీ మొత్తం అందమైన గ్రిల్స్ ఏర్పాటు చేసి వాటిలో రకరకాల పూల మొక్కలు, అలంకరణ మొక్కలతో సుందరంగా ముస్తాబు చేశారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా లేజర్ సాంకేతికతో పివి కాంస్య విగ్రహం రూపుదిద్దుకోవడంతో నెక్లెస్ రోడ్డు కూడలికి, నగరానికి అదనపు హంగులు అద్దుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News