Monday, May 6, 2024

జాతీయ స్థ్ధాయిలో మెరిసిన హుస్నాబాద్

- Advertisement -
- Advertisement -

హుస్నాబాద్: ప్రజాప్రతినిధులు అధికారుల కృషి ప్రజల సమన్వయంతో అభివృద్ధ్దిలో అగ్ర పథాన జాతీయ స్థ్ధాయిలో పలు అవార్డులు కైవసం చేసుకొని మెరిసిందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం పట్టణంలోని స్ధానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకట్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, ప్రతినిధులు, కార్మికులు, అధికారులు, సిబ్బంది, స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి మండల ప్రజాపరిషత్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఆశయాలకు అనుగుణంగా కేటిఆర్ మార్గ నిర్ధేశంతో మున్సిపల్ శాఖ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

హుస్నాబాద్ పట్టణానికి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అవార్డులు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్ 2021లో పట్టణం పారిశుద్ధం పట్ల మెరుగైన ప్రతిభ కనబరిచినందుకు ఫాసెస్ట్ యూవర్స్ సీటి అవార్డు , స్వచ్ఛ సర్వేక్షన్ 2022లో బెస్ట్ సీటీ ఇన్ సిటిజన్ ఫీడ్ బ్యాక్ అవార్డును సొంతం చేసుకున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మహిళలు తాగునీటి కోసం బిందెలు పట్టుకొని బావులు, బోర్ల దగ్గరికి వెళ్లే పరిస్థితి ఉండేదని రాష్ట్రం ఏర్పడ్డాక సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో మిషన్ భగిరథ ద్వారా ప్రతి గ్రామంలోని ఇంటింటికి తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా మహాసముద్రం గండి పూర్చడం ద్వారా హుస్నాబాద్ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగి నీటి వనరులు అధిక మయ్యాయని తెలిపారు.

హుస్నాబాద్ పట్టణాన్ని నగర పంచాయతీ నుండి మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం వల్ల అభివృద్ధ్ది వేగవంతమైందన్నారు. పట్టణంలోని ఇండోర్ స్టేడియం కోటి 50 లక్షలు, డిగ్రి కాలేజ్ 2 కోట్లు, ఉమెన్స్ హాస్టల్, టిటిసి భవనం కోటి, ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ 85 లక్షలు, ఓపెన్ జిమ్, 24 లక్షలు, ఎల్లమ్మచెరువు పునరుద్ధ్దరణ సుందరీకరణకు 9 కోట్ల 50 లక్షలు, బస్తీ దవాఖాన, 23 లక్షలతో పాటు మరిన్ని అభివృద్ధి పనులు మంత్రి కేటిఆర్ సహకారంతో పూర్తి చేసుకుంటున్నట్లు వెల్లడించారు. పట్టణంలోని ఏసిపి , ఆర్డిఓ, డిఈ, ఎడి ఎలక్ట్రానికల్ , ఫైర్ సబ్ స్టేషన్, ఆర్‌అండ్ బ ఇ సబ్ డివిజన్, నేషనల్ హైవే సబ్ డివిజన్ ఆఫీసులను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలోని పట్టణాలు, మున్సిపాలిటీలు ప్రగతి పథంలో నిలిచాయన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ కృషితో తెలంగాణలోని పట్టణాలు సరికొత్త రూపు సంతరించుకున్నాయని తెలిపారు.

అనంతరం మున్సిపల్ అధికారులను సిబ్బందిని ఘనంగా సన్మానించారు. పట్టణ ప్రగతి దినోత్సవం కార్యక్రమంలో భాగంగా మెప్మా 25 మహిళా సంఘాలకు 2 కోట్ల రూపాయల బ్యాంకు రుణాల చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అయిలేని అనిత, ఎఎంసీ చైర్మన్ ఎడబోయిన రజిని, మున్సిపల్ కమిషనర్ సుంకే రాజ మల్లయ్య, పట్టణ కౌన్సిలర్లు నళినిదేవి, వాల సుప్రజ, రమాదేవి, బాగ్యరెడ్డి, గోవింద రవి, కోఆ ప్షన్ సభ్యులు ఆయూబ్, శ్రీలత, శంకర్ రెడ్డి, పట్టణ బిఆర్‌ఎస్ అద్యక్షుడు ఎండి. అన్వర్, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మాజీ ఎఎంసీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, నాయకులు బోజురవీందర్, వాల నవీన్‌రావు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News