Monday, April 29, 2024

హైబ్రిడ్ పద్ధతిలో కేసుల విచారణ పనిచేయదు: సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -
Hybrid mode not working Says Supreme Court
ప్రత్యక్షపద్ధతి లోనే కోర్టులు పనిచేయాలి

న్యూఢిల్లీ : హైబ్రిడ్ పద్ధతిలో కేసుల విచారణ పనిచేయదని, ఇదివరకటి యధాతధ స్థితి రావాలని, ప్రత్యక్ష విచారణ పద్ధతి లోనే కోర్టులు పనిచేయాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు శుక్రవారం అభిప్రాయపడింది. వర్చువల్‌గా కేసులను విచారించడం ప్రామాణికంహై కాదని పేర్కొంది. హైబ్రిడ్ పద్ధతిలో విచారణ అంటే విచారణ సమయంలో ఇరు పార్టీలకు చెందిన వ్యక్తుల సంఖ్య కొవిడ్ నిబంధనల ప్రకారం గది సైజును మించి ఎక్కువగా ఉంటే అప్పుడు ధర్మాసనం హైబ్రిడ్ పద్ధతిలో విచారణ జరుపుతుంది. ప్రస్తుతం కోర్టు గదిలో కేవలం 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే ప్రత్యక్ష విచారణ జరిపేలా పార్టీల్లో ఒకరు ప్రత్యక్షంగా, మరొకరు టెలికాన్ఫరెన్సులో ఉంటారు. ఇదే హైబ్రిడ్ విచారణ. ఇక్కడ కోర్టులో కూర్చుని, స్క్రీన్ల వైపు చూస్తూండడం తమకు సంతోషం కలిగించడం లేదని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బిఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం తమ అభిప్రాయం వెల్లడించింది.

కోర్టులు ప్రజల కోసం బహిరంగంగా తెరుచుకోవాలని, ప్రజలందరికీ న్యాయం అందుబాటులో ఉండాలని తాము కోరుకుంటున్నట్టు వారు పేర్కొన్నారు. హైబ్రిడ్ పద్ధతిలో విచారణకు తాము ప్రయత్నించామని, కానీ పనిచేయడం లేదని, ప్రజలు కోర్టులకు రావడం లేదని చెప్పారు. కోర్టులు ప్రత్యక్షంగా పనిచేసేలా యథాతధ స్థితి రావాలని అభిప్రాయపడ్డారు. ఎన్‌జివొ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సొసైటీస్ ఫర్ ఫాస్ట్ జస్టిస్, జులియో రిబెయిరో, షైలేష్ ఆర్ గాంధీ, వంటి ప్రముఖ వ్యక్తులు వర్చువల్ కోర్టు విచారణ కక్షిదారుల ప్రాథమిక హక్కు కింద వెల్లడించాలని కోరడంతో దీనిపై తమ సూచనలు అందచేయాలని ధర్మాసనం పిటిషనర్లకు సూచించింది. దీన్ని ఎలా చేపట్టాలన్న దానిపై నాలుగు వారాల తరువాత వాయిదాలో ఆలోచిస్తామని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News