Monday, April 29, 2024

గణనాథులకు ఘణంగా వీడ్కోలు పలికిన నగర వాసులు

- Advertisement -
- Advertisement -

Hyderabad ganesh nimajjanam 2021

హైదరాబాద్: తోమ్మిది రోజుల భక్తుల పూజలు అందుకున్న గణనాథుడికి నగరవాసులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఊరేగింపులు, మేళతాళాలతో గణనాథుడి శోభాయాత్రలో అత్యుత్సాహంగా పాల్గొన్నారు. గత సంవత్సరం కరోనా కారణంగా ఇళ్ళల్లో గణనాథులు భక్తులు పూజలను అందుకున్నారు. కాని ఈ సంవత్సరం కరోనా ప్రభావం తగ్గడంతో కేసులు సంఖ్య కూడా తగ్గింది. దీంతో ప్రభుత్వం కూడా ఆంక్షలు పూర్తి స్థాయిలో సడలించడంతో భక్తులు వాడవాడలా పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసి గత సంవత్సరం కరోనా కారణంగా ఈ ఉత్సవాలను జరుపుకోలేని నగరవాసులు ఆ లోటును ఈ సంవత్సరం భర్తీ చేసుకున్నారు.ఒక వైపు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాను ఘనంగా నిర్వహిస్తున్నారు. చివరి రోజు కావడంతో నిర్వాహకులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్నదానాలు,ప్రసాదాల వితరణ గావించారు.చౌరస్తాల వద్ద మండపాల నిర్వహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

నగరంలో ఏ చౌరస్తా చూసినా వీడ్కోలు సంబారాలతో నిండిపోయాయి. ముఖ్యంగా రామ్‌నగర్, అడిక్‌మెట్, వారాసిగూడ,చిలకలగూడ,ఈసీఐఎల్ చిక్కడపల్లి, నారాయాణగూడ,ముషీరాబాద్, అంబర్‌పేట, మాసారంబాగ్,ఫీవర్ ఆసుపత్రి,గోల్నాక చౌరస్తా దిల్‌షుక్‌నగర్, కొత్తపేట చౌరస్తా, తదితర ప్రాంతాల్లోనే కాకుండా పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్‌లలో సైతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లును గావించారు .ఆయా ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతి నిధులు తమ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులను, సినీ, నాటక రంగాల్లో ప్రముఖ ప్రాత పోషించిన వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించారు. దీంతో వారి చూసేందుకు, వారి ఉపన్యాసాలు వినేందుకు పెద్ద ఎత్తన భక్తులు తరలి వచ్చారు.దీంతో ఆయా మార్గాల్లో వాహనాలను రద్దీ తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా వాహనాలను ఇతర ప్రాంతాల మీదుగా దారిమళ్ళించారు. మండపాల వద్ద భక్తుల రద్దీని తగ్గించేందుకు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు.

పూర్తిగా తగ్గిని కరోనా భయం

కరోనా భయం ఇంకా ప్రజల్లో పూర్తిగా తగ్గలేదు. ఒక వైపు కేంద్ర ప్రభుత్వంతో పాటు, వైద్య నిపుణులు మూడోవేవ్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించడంతో భయం భయంగానే భక్తులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. గతంలో మాదిరిగా గతంలో మాదిరిగా విగ్రహాలు ఏర్పాటుకు అంతగా ఆసక్తి చూపలేదు. గడచిన సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం విగ్రహాల సంఖ్యకూడా బానే తగ్గింది. గతంలో సుమారు ఒక కిలో మీటర్ పరిధిలోనే చిన్నాపెద్దా కలిపి సుమారు 50 నుంచి 80 వరకు ఉండగా అది ఈ సంవత్సరం 15 నుంచి 30 కూడా గగనమైంది. అంతే కాకుండా ప్రతి చౌరస్తాలో వివిధ సంఘాల నాయకులు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసేవారు. అంతే కాకుండా మేళతాళాలు, డిజేలే సందడితో ఆయా ప్రాంతాలన్నీ సందడి నెలకొనేవి. గత సంత్సరాలతో పొలిస్తే ఈ సంవత్సరం జరిగిన ఉత్సవాలు సాధాసీదగా జరిగినట్లు భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News