Friday, April 26, 2024

‘మెట్రో’ పరుగులకు ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

hyderabad Metro rail may resume from Sept 1

హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ నేపథ్యంలో నిలిచిపోయిన మెట్రోరైళ్లు వచ్చేనెలలో పట్టాలపై పరుగులు పెట్టించేందుకు అధికారులు ఏర్పా ట్లు చేసేందుకు సిద్ధమైతున్నారు. అన్‌లాక్ నాల్గో మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం మరిన్ని సడలింపులు ఇవ్వాలని భావిస్తోంది. అందులో భాగంగా సెప్టెంబర్ 1నుంచి దేశవ్యాప్తంగా మెట్రో రైలు సేవలకు అనుమతి ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఢిల్లీ మెట్రో పరుగులు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తుంది. కానీ హైదరాబాద్ మెట్రో అనుమతులు రాష్ట్ర ప్రభుత్వానికి వదిలివేయడంతో సిఎం కెసిఆర్ నిర్ణయంపై మెట్రో అధికారులు వేచి చూస్తున్నారు. లాక్‌డౌన్ నుంచి రోజు కు రూ.4 కోట్ల నష్ట పోతున్నట్లు, మరికొన్ని రోజులైతే మెట్రో నడపడం మరింత భారంగా మారి చార్జీలు పెం చాల్సి వస్తుందని నిర్వహకులు పేర్కొంటున్నారు.

మరొపక్క అధికారులు మెట్రో ప్రారంభిస్తే ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారనే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. రైలు తిరిగితే ఆర్టిసీ బస్సులు కూడ నడపాల్సి వస్తుంద ని, దీంతో మళ్లీ వైరస్ రెక్కలు కట్టుకుని ప్రజల ప్రాణాల ను హరిస్తుందని భావిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యం లో లాక్‌డౌన్ విధించడంతో గత మార్చి 22 జనతా బం ద్ నుంచి దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లు నిలిచిపోయ్యాయి. గ్రేటర్ నగరంలో మెట్రో 72 కిమీ పోడువుతో మూడు కారిడార్లల్లో రైళ్లను నడుపుతుంది. రోజుకు 1.50లక్షలమంది ప్రయాణికులు వివిధ స్థ్దానాలకు రాకపోకలు సాగించేవారు. రోజు మెట్రో టిక్కెట్లతో పాటు వాణిజ్య సముదాయాల ద్వారా మెట్రో ఆదాయం సమాకూరేది.

కరోనా కారణంగా ఐదునెలల్లో రూ. 8వందల కో ట్లు నష్టపోయినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. కరో నా నిబంధలకు అనుగుణంగా రైళ్లలో ప్రయాణికుల మధ్య దూరం పాటించేలా చర్యలు తీసుకున్నట్లు, ప్రతి రైలు పూర్తిగా శానిటైజర్ చేసిన తరువాతే పట్టాలపై ఎక్కించి, వైరస్ వ్యాప్తిచెందకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొంటున్నారు. నగరంలో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు నడవకపోవడంతో చాలామంది ప్రైవేటు ఉద్యోగులు ఉద్యోగాలకు దూరమైయ్యా రు. ప్రైవేటు ట్యాక్సీలో వెళ్లాలంటే చార్జీలు ఎక్కువ అవుతుండటంతో మెట్రో రైళ్లు నడిచిన తరువాత ఉద్యోగాలు చేసేందుకు యువకులు సిద్ధమైతున్నారు. ప్రభుత్వం మెట్రో రైలు ప్రారంభించి ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకునేలా చూడాలని నగర ప్రజలు కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News