Saturday, April 27, 2024

భారీ వర్షాలతో హైదరాబాద్ ఆగమాగం

- Advertisement -
- Advertisement -

Hyderabad people suffer for heavy rains

హైదరాబాద్: నగరాన్ని వర్షం ఆగమాగం చేస్తోంది. రాత్రి పగలు అన్న తేడా లేకుండా కురిస్తున్న కుండపోత వర్షాలు నగరంలో బీభత్సవం సృష్టిస్తున్నాయి. ఇప్పటీకే వరస వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారు జాము వరకు దఫాలు దఫాలుగా కురిసిన కుంభవృష్టి వర్షంతో సిటీ జనులు చిగురుటాకులా వణికి పోయ్యారు. ఈనెల 6వ తేదీన బంగాళాఖాతం అల్ప పీడనం ఏర్పడే అవకాశాలుండడంతో మరో రెండు నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో నగరవాసులు హడలిపోతున్నారు. గురువారం సాయంత్రం 7 గంటలకు మెదలైన వర్షం శుక్రవారం తెల్లవారు జాము వరకు కొనసాగింది. నగర వ్యాప్తంగా ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతంలో వరస పెట్టి భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌తో పాటు పలు ప్రాంతంలో 8 సె.మి. నుంచి ఏకంగా 10 సె.మి. లోపు వర్షం కురువడంతో వరద నీరు నగర పుర వీధుల్లో ఏరులై పారింది.

రోడ్లు పూర్తిగా నది కాల్వలను, వాహనాలు పడవలను తలపించాయి. గంట వ్యవధిల్లోనే కుండ పోత వర్షాన్ని తలపించడంతో నగరమంతా జలసాంధ్రంగా మారింది. లొతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్భంధనంలో చిక్కుకోవడంలో వేలాది మంది రాత్రి మొత్తం కంటి మీద కునుకు లేకుండా గడిపారు. వర్షం కారంణంగా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం చోటు చేసుకోవడంతో ఒకవైపు వరద నీరు మరోవైపు చిమ్మ చీకట్లోనే కాలం వెళ్లదీశారు. వరద ఉధృతికి పలు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్న పలువురి స్థానికులు రక్షించారు. శుక్రవారం ఉదయం 10 గంటల వరకు కూడా పలు ప్రాంతాలో రోడ్లపై వరద ఉధృతి తగ్గలేదు ఒకవైపు రోడ్లపై వరద కొనసాగుతుండగానే మరో వైపు పలు ప్రాంతాల్లో తిరిగి వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నాం తర్వాత మరోసారి నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో నగరవాసులు మరింత ఇబ్బంది పడ్డారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, చర్లపల్లి, కాప్రా, మల్లాపూర్, సికింద్రాబాద్, తార్నాక, హబ్సిగూడ, ఎల్‌బినగర్, షేక్‌పేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

వర్షంలోనే సహాయ చర్యలు 

జిహెచ్‌ఎంసి అత్యవసర బృందాలు భారీ వర్షంలోనే సహాయ చర్యలను చేపట్టాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నాం వరకు సహాయ చర్యలను కొనసాగించారు. అయితే కుంభవృష్టి వర్షంతో పలు ప్రాంతాల్లో అవేమి ఫలించలేకపోయ్యాయి. సర్కిళ్లవారిగా ఎక్కడికక్కడ ప్రత్యేక సహాయ బృందాలు తమ సేవలను అందించాయి. రోడ్లపై చేరిన వరద నీటిని మోటారు పంపు సెట్ల ద్వారా తొలగించారు. అదేవిధంగా మరికోన్ని ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్లు ద్వారా వరద నీటిని పంపే ప్రయత్నం చేశారు. వరద నీరు వెళ్లిన తర్వాత రోడ్లపై పెరుకు పోయిన బురద, మట్టిని తొలగించి రోడ్లను శుభ్రం చేశారు. ట్రాఫిక్ పోలీసులు సైతం తీవ్రంగా శ్రమించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు అష్టా కష్టాలు పడ్డారు.

రాత్రింతా భారీ వర్షం కురువడంతో రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి దీంతో ప్రధాన ప్రాంతాల్లో ఆర్ధరాత్రి వరకు ట్రాఫిక్ క్లియర్ చేశారు. మరోవైపు భారీ వర్షం నేపథ్యంలో నగరవాసుల నుంచి జిహెచ్‌ఎంసికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరించారు. ఎల్‌బినగర్, శేరిలింగంపల్లి, కాప్రా, ముషీరాబాద్, చందానగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ మూసాపేట్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌తో పాటు ప్రతి సర్కిల్‌లో 10 నుంచి 15 ప్రధాన మార్గాల్లో వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో సహాయక బృందాలు పలుచోట్ల వరద నీటిని తొలగించారు. మరోవైపు డిఆర్‌ఎఫ్ బృందాల సహాయక చర్యలను అందించాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 39 చోట్ల వరద నీరు నిలిచిపోవడం, 39 చోట్ల చెట్లు కూలిపోయినట్లు మొత్తం 59 ఫిర్యాదులు అందగా వాటిని అప్పటీకప్పుడు పరిష్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News