Saturday, April 27, 2024

పట్టిస్తే రూ.10లక్షలు

- Advertisement -
- Advertisement -

Hyderabad Police Announce Rs 10 Lakh Reward

సింగరేణి కాలనీ చిన్నారిపై హత్యాచార నిందితుడి కోసం గాలింపు
రంగంలోకి 10 ప్రత్యేక బృందాలు
ఇప్పటివరకు ఆధారాలు దొరకలేదు : సిపి అంజనీకుమార్

మన తెలంగాణ/హైదరాబాద్ : సైదాబాద్ సింగరేని కాలనీలో చిన్నారి హత్యాచార ఘటనపై మంగళవారం నాడు అదనపు డిజి శిఖాగోయల్, జాయింట్ సిపి రమేశ్ రెడ్డి, టాస్క్‌ఫోర్స్ డిసిపి చక్రవర్తిలతో సిపి అంజనీ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈక్రమంలో పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిపట్లు సిపి అంజనీకుమార్ తెలిపారు. ఇంతవరకు నిందితునికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించాయి..? కేసు ఎంత పురోగతి సాధించింది..? అన్న అంశాలను పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నామన్నారు.ఈ నేపథ్యంలో నిందితుని ఆచూకీ కోసం వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలోనూ పోలీసులు తనికీలు చేపడుతున్నారన్నారు. నిందితుని ఫోటోను రాష్ట్రంలోకి అన్ని పోలీస్ స్టేషన్‌లకు పంపించామని, ఎక్కడికక్కడ స్థానిక పోలీసులు సైతం నిందితుని కోసం వేట సాగిస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులు వివరిస్తున్నారు.

హత్యాచార నిందితున్ని పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్ బృం దాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. నగరంలోని వైన్సుల వద్ద పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. కాగా నిందితుడు ముందస్తుగా సెల్‌ఫోన్‌ను స్విచ్చాఫ్ చేయడంతో పోలీసుల గాలింపునకు ఆటంకంగా మారింది.కాగా నిందితుని కోసం ట్యాంక్ బండ్, నగరంలోని పలు పార్కులు, రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్లు, మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్‌లలో జల్లెడపడుతున్నారు. ఈక్రమంలో కొన్ని బృందాలు నిందితుని స్వగ్రామంతో పాటు బంధువుల ఊళ్లలో తనికీలు చేపడుతున్నారు. ఇదిలావుండగా ఆరేళ్ల చిన్నారిపై పాశవిక హత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడంపై కుటుంబసభ్యులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన పల్లంకొండ రాజు తప్పించేందుకు స్థానిక యువకుడు సహకరించారన్న అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

మారువేషాల్లో సంచరిస్తున్న నిందితుడు

చిన్నారి దారుణ ఘటన కేసులో నిందితుడు రాజు గుండు చేయించుకుని మారువేశాలలో తిరుగుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అదేవిధంగా గుండు చేయించుకుని, ముఖానికి మాస్క్ పెట్టుకుని సంచరిస్తున్నాడన్న కోణంలో కూడా పోలీసులు గాలిస్తున్నారు. అలాగే పోలీసులు గుర్తుపట్టకుండా ఉండేందుకు తలకు టోపీ, మాస్కు, భుజంపై తువ్వాలు వేసుకుని సంచరిస్తున్న వారిపై పోలీసుల నిఘా సారిస్తున్నారు. కాగా చిన్నారి దారుణ హత్యాచార ఘటన తరువాత నిందితుడు రాజు తాను పని చేసిన కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.1800 తీసుకుని తన సొంత ఊరికి వెళుతున్నానని చెప్పి వెళ్లిపోయాడు. ఈక్రమంలో నిందితుని స్వగ్రమంలో తనికీలు చేపట్టిన పోలీసులు మరోవైపు సైదాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రతి లేబర్ అడ్డాను కూడా ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

సిసి ఫుటేజీ ఆధారంగా తనిఖీలు

మద్యానికి బానిసైన రాజు కోసం సైదాబాద్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, ఎల్‌బినగర్ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలతో పాటు రహదారులపై ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. రాజు స్వగ్రామం అయిన జనగామ జిల్లా కొడకంట్లతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో పోలీసులు ఇప్పటికే గాలించడంతో పాటు ఓ పోలీసు బృందాన్ని అక్కడే ఉంచారు. అలాగే రాజు సమీప బంధువులను ప్రశ్నించిన పోలీసులు అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. రాజు స్నేహితుడు ఘటన అనంతరం అతడిని పక్కకు తీసుకెళ్లి పారిపోవాలంటూ చెప్పినట్లు ఆరోపణలు రావడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అదేవిధంగా సిసి కెమెరాలో రాజు, అతడి స్నేహితుడు వెళ్తున్న దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటనపై తనకు ఎలాంటి సంబంధం లేదని. ఆ విషయం కూడా తనకు తెలియదని పోలీసులు ఎదుట రాజు స్నేహితుడు చెప్పినట్లు సమాచారం. పోలీసులు మాత్రం వీరిద్దరు తిరిగిన ప్రదేశాలలోని సిసిటివి దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

ఆచూకీ చెబితే రూ. 10 లక్షల నజరానా

సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన నిందితుడు రాజను పట్టించినా, ఆచూకీ చెప్పిన వారికి రూ. 10లక్షలు బహుమతిగా ఇవ్వనున్నట్లు నగర సిపి అంజనీకుమార్ మంగళవారం నాడు ప్రకటించారు. ఈక్రమంలో నిందితుని ఫోటోతో పాటు పోలీకలను విడుదల చేశారు. దాదాపు 5.9 అడుగుల ఎత్తున్న నిందితుడు రాజు తల జుట్టుకు రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాడని, రెండు చేతులకు మౌనిక అని టాటూలు వేసుకున్నట్లు తెలిపారు. అలాగే మద్యానికి బానిసైన రాజు మద్యం సేవించి బస్‌స్టాండ్, పార్కులలో నిద్రిస్తాడని, అదేవిధంగా అతను ఫార్మల్ ప్యాంట్ ధరించిఉన్నాడని సిపి తెలిపారు.

జాతీయ గిరిజన కమిషన్‌కు వినతి

అత్యాచారానికి గురైన ఆరేళ్ల గిరిజన బాలికకు సత్వరమే న్యాయం చేయాలని కోరుతూ జాతీయ గిరిజన కమిషన్‌ను గ్లోబల్ బంజారా వెల్ఫేర్ సొసైటీ ఢిల్లీ అధ్యక్షులు డాక్టర్ ఆనంద్, బంజారా మహిళా ఎన్‌జివొ చైర్మన్ సుజాత ఇస్లావత్ ఆశ్రయించారు. హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాంతంలో ఉన్న సింగరేణి కాలనీలో ఓ కామాంధుడి చేతిలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్యకు గురైంది. నిందుతుడిని పోక్సో యాక్ట్ క్రింద ఉరి శిక్ష పడేలా చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసును సత్వరమే పరిష్కరించాలని, అలాగే బాధిత కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, పిల్లల చదువుల కోసం ఆదుకొని, శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేయాలని డాక్టర్ ఆనంద్ డిమాండ్ చేశారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పసి పిల్లలు, ఆడవారి మీద ఇలాంటి హేయమైన చర్యలు ఆగడం లేదని ఆయన అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News