Thursday, May 16, 2024

ఆడంబరాలకు పోను

- Advertisement -
- Advertisement -

భవనాలు అవే.. వాహనాలు అవే…
దుబారా ఖర్చులు తగ్గించుకుంటాం

మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలోనే సిఎం క్యాంపు కార్యాలయం

అక్కడి ఖాళీ స్థలంలో షెడ్డు వేసి క్యాంపు ఆఫీసు ఏర్పాటు
ప్రజాభవన్‌లోని మరో బిల్డింగ్‌ను ఇంకో మంత్రికి కేటాయింపు కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోం

శాసనసభ భవనాలను సమర్థంగా ఉపయోగించుకుంటాం

శ్వేతపత్రంతో సహా అన్ని అంశాలపై చర్చించి… సమయం వచ్చినపుడు విడుదల చేస్తాం

రాయదుర్గం-ఎయిర్‌పోర్టు మెట్రో ఉపయోగకరం కాదు

మరో రూట్‌లో మెట్రో ప్లాన్ చేస్తాం
శుక్రవారం నాటి బిఎసి సమావేశంలో అసెంబ్లీ అజెండా ఖరారు
పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ

గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం
అధికారుల నియామకాల్లో పైరవీలు లేవు..హంటింగ్ ఉండదు
మీడియాతో చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి గా తాను ఆడంబరాలకు పోదల్చుకోలేదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దుబారాను తగ్గించాలనుకుంటున్నానని సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు ప్రస్తుతం క్యాంపు ఆఫీస్ లేనందున మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ప్రాంగణంలో ఖాళీగా ఉన్న ఒక ఎకర స్థలంలో షెడ్డులో ఉండాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అక్కడ భవనాన్ని నిర్మించాలంటే కోట్లాది రూపాయల ఖర్చవుతుందని, అందువల్లే ఒక షెడ్డును కట్టించుకొని దానినే క్యాంప్ ఆఫీస్‌గా వాడుకుంటానని ఆయన అన్నా రు.

అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక, కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో రేవంత్‌రెడ్డి చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అనవసరపు ఖ ర్చులను ప్రభుత్వం బాగా  తగ్గిస్తుందన్నారు. పాత అసెంబ్లీ బిల్డింగ్‌లో కౌన్సి ల్ సమావేశాలు, ఇప్పుడు ఉన్న అసెంబ్లీలో శాసనసభ జరుగుతుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు.శాసనసభ భవనాలను సమర్థంగా వాడుకుంటామన్నారు. పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ఉండబోతోందన్నారు. ప్రజాభవన్‌లో ఇంకో బిల్డిం గ్‌ఉందని, అది ఇంకో మంత్రికి ఇస్తామన్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు మెట్రో ఉపయోగకరంగా ఉండదని, మరోరూ ట్లో మెట్రో ప్లాన్ చేస్తామని సిఎం తెలిపారు.

శ్వేతపత్రాలు సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామని రేవంత్ తెలిపారు. నేడు (శుక్రవారం) బిఏసి సమావేశం ఉంటుందన్నారు. అందులో శాసనసభ సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామన్నారు. గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని సిఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసే ప్రసక్తే లేదని సిఎం రేవంత్ పేర్కొన్నారు.అధికారుల నియామకంలో పైరవీలు లేవని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సిపిలు ఎవరు కూడా పోస్టింగ్‌ల కోసం తనను అడగలేదు అని ఆయన తెలిపారు.

అధికారుల హంటింగ్ ఉండదు, అధికారుల బదిలీలు ఉంటాయని, కానీ, వెంటపడం అని సిఎం పేర్కొన్నారు. అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు కలిసి ఉండాలి అనేది తమ ఆలోచన అని, జూబ్లీహాల్‌కు మరిన్ని హంగులు దిద్దుతామని తెలిపారు. మీడియా ఆధారాలతో వార్తలు ప్రసారం చేస్తే మాకు కూడా సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News