Home తాజా వార్తలు అక్టోబర్ 2న ‘ఇదే మా కథ’

అక్టోబర్ 2న ‘ఇదే మా కథ’

Idhe Maa Katha release on October 2

 

సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో రోడ్ జర్నీ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘ఇదే మా కథ’. విభిన్న నేపథ్యం ఉన్న నలుగురు బైక్ రైడర్లు తమ గమ్యానికి చేరుకునే మార్గంలో ఒకరికొకరు పరిచయమై ఒకరి గురించి మరొకరు ఏం తెలుసుకున్నారు? గమ్యానికి ఎలా చేరుకున్నారు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. గురు పవన్ దర్శకత్వంలో మనోరమణ సమర్పణలో గురప్ప ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ గొల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు. టాలీవుడ్‌లోనే మొదటి రోడ్ జర్నీ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.