Thursday, May 9, 2024

ఐజి కుమారుడికి కరోనా..

- Advertisement -
- Advertisement -

coronavirus

మనతెలంగాణ/హైదరాబాద్‌ః ఆంధప్రదేశ్‌లోని అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారి(ఐజి) కుమారుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పోలీసు ట్రైనింగ్ సెంటర్‌లో ఐజిగా ప్రస్తుతం కోవిడ్ నియంత్రణ ప్రత్యేకాధికారిగా అనంతపురంలో విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, సదరు ఐజి ఇటీవల కాలంలో విజయవాడ నుంచి పోలీస్ ట్రైనింగ్ కళాశాలకు తన కుటుంబాన్ని షిఫ్ట్ చేశారు. ఇదిలావుండగా, ఐజి కుమారుడు నెల రోజుల క్రితం కెనడా నుంచి అనంతపురానికి వచ్చాడు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కోవిడ్ ఆసుప్రతికి తరలించి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు.

IG’s Son Tests Positive for Covid 19 in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News