Monday, April 29, 2024

ఇండియా కాప్ లక్ష్యం భేష్: ఐఎంఎఫ్

- Advertisement -
- Advertisement -

IMF Welcomes India's COP26 Announcement

వాషింగ్టన్ : పునరుత్థాన ఇంధనం, 2070 గడువుతో కార్బన్ ఉద్గారాల శూన్యస్థితి లక్ష్యాలను వెలువరించిన భారత్‌ను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అభినందించింది. గ్లాస్గోలో జరుగుతున్న ఐరాస ఆధ్వర్యపు వాతావరణ మార్పుల సదస్సు (కాప్ 26)లో భారతదేశం చేసిన సూచనలు, ప్రతిపాదనలు నిర్మాణాత్మకంగా ఉన్నాయని , వీటిని స్వాగతిస్తున్నామని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ విభాగం సంచాలకులు జెర్రీ రైస్ ఓ ప్రకటన వెలువరించారు. వాస్తవిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని భారతదేశం ఈ నిర్మాణాత్మక అంశాల దిశలో ప్రతిపాదన చేసిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనే దిశలో కాప్ సదస్సులో భారతదేశం వెలువరించిన అంశాలను తాము పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News