Saturday, April 27, 2024

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు 3 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: తోషఖానా అవినీతి కేసులో పాక్తిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష, ఐదేళ్లపాటు రాజకీయ అనర్హత విధిస్తూ శనివారం పాకిస్తాన్ కోర్టు తీర్పు వెలువరించింది.

ఇస్లామాబాద్‌లోని జిల్లా, సెషన్స్ కోర్టుకు చెందిన అదనపు న్యాయమూర్తి హుయున్ దిలావర్ శనివారం తీర్పు వెల్లదించారు. ఇమ్రాన్ ఖాన్ రూ. 1 లక్ష జరిమానా కూడా విధిస్తూ దాన్ని చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల పాటు జైలు శిక్ష ఉంటుందని న్యాయమూర్తి ప్రకటించారు.

తోషిఖానా అవినీతి కేసులో పాకిస్తాన్ ఎన్నికల కమిషన్(ఇసిపి) గత ఏడాది నమోదు చేసిన ఫిర్యాదు కేసులో ఇమ్రాన్ ఖాన్(70)కు న్యాయమూర్తి శనివారం తీర్పు వెలువరించారు. ఇదే కేసులో ఇమ్రాన్ ఖాన్‌పైఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేసింది. 2018 నుంచి 2022 మధ్య పాక్ ప్రధానిగా ఉన్నకాలంలో విదేశీ పర్యటనలలో తనకు లభించిన రూ. 14 కోట్లకు పైగా విలువైన బహుమతపులను అమ్మినట్లు ఇమ్రాన్ ఖాన్‌పై ఆరోపణలు నమోదయ్యాయి.

ఇతర దేశాలకు చెందిన ప్రభుత్వాలు తమ దేశ ప్రధాన మంత్రి, ఇతర ప్రభుత్వాధినేతలకు అందచేసే బహుమతులను భద్రపరిచే శాఖ తోషఖానాగా పాక్‌లో వ్యవహరిస్తారు. ఆ బహుమతులు ప్రభుత్వానికి చెందుతాయి. అయితే ఇమ్రాన్ ఖాన్ తనకు అందిన బహుమతులను అమ్ముకున్నట్లు ఆయనపై అరోపణలు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News