Saturday, April 27, 2024

ఉక్రెయిన్ తీర్మానంపై ఐరాస ఓటింగ్‌కు భారత్ దూరం

- Advertisement -
- Advertisement -

న్యూస్‌ఢిల్లీ: ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని విరమించి తన సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని రష్యాకు పిలుపునిస్తూ ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రవేశపెట్టిన తీర్మానం ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండిపోయింది. చైనా, పాకిస్తాన్ కూడా ఓటింగ్‌లో పాల్గొనలేదు. తీర్మానానికి అనుకూలంగా 41 దేశాలు ఓటు వేయగా రెండు రోజుల చర్చల అనంతరం తీర్మానం ఆమోదం పొందింది.

ఏడు దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించగా భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 32 సభ్య దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. అయితే..భారత ఉపఖండంలోని చిన్న దేశాలైన నేపాల్, భూటాన్, మాల్దీవులు, అప్ఘానిస్తాన్ తీర్మానాన్ని బలపరుస్తూ ఓటింగ్ చేశాయి.

తాము ఓటింగ్‌కు ఎందుకు దూరంగా ఉండవలసి వస్తోందో భారత్ వివరణ ఇస్తూ ఉక్రెయిన్, రష్యాలను కలపకుండా యుద్ధం ఎలా ముగుస్తుందో తెలియడం లేదని పేర్కొంది. రెండు పక్షాల ప్రమేయం లేకుండా అర్థవంతమైన, విశ్వసనీయమైన ఫలితాన్ని ఇవ్వలేవని ఐరాసలో భారత తరఫున శాశ్వత ప్రతినిధి రుచికా కాంబోజ్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News