Monday, May 6, 2024

దూకుడు భారత్‌దే: చైనా విదేశాంగ మంత్రి

- Advertisement -
- Advertisement -

India-China Border FaceOff

బీజింగ్: సరిహద్దుల్లో పరిస్థితిని భారతదేశమే దిగజారుస్తోందని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి స్పందించారు. ఏకపక్షంగా హద్దులు దాటి వస్తున్నారని, దీనితో ఘర్షణ చెలరేగిందని సోమవారం నాటి ఘటనపై చైనా అధికారికంగా తమ ప్రకటనలో తెలిపింది. కవ్వింపులతో పరిస్థితిని సంక్లిష్టం చేసుకోవద్దని భారత్‌ను చైనా అధికారికంగా హెచ్చరించింది. సరిహద్దులు దాటవద్దని సమగ్ర నిర్ణయం తీసుకున్నామని, అయితే దీనిని ఉల్లంఘించి భారత సైనికులు తమ సైనికులను రెచ్చగొట్టారని వాస్తవాధీన రేఖ వెంబడి వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు దేశాల నాయకత్వ పరిధిలో నిర్ణయించిన విషయాన్ని తాము తెలియచేస్తున్నట్లు చైనా అధికార ప్రతినిధి తెలిపినట్లు అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ తెలిపింది. సామరస్యం కోసం తాము ప్రయత్నిస్తున్నామని, అయితే ప్రస్తుత పరిణామం ఇందుకు విరుద్ధంగా ఉందని చైనా విదేశాంగ మంత్రి పేర్కొన్నట్లు పత్రిక పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News