Monday, April 29, 2024

రెండు భారత్‌లు: రాహుల్

- Advertisement -
- Advertisement -

ఒకటి పేదలది, రెండోది ధనవంతులదిగా విభజించారు
ఆర్థిక వ్యవస్థలో అంబానీ, అదానీ వేరియంట్ వ్యాప్తి
మోడీ ప్రభుత్వంలో 10మందికే మేలు
చైనా, పాకిస్థాన్‌లను ఒకటి చేశారు
భారత్‌పై డ్రాగన్‌కు స్పష్టమైన విజన్ ఉంది
ఉపాధిని అటకెక్కించి నిరుద్యోగం పెంచారు
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో మోడీ సర్కార్‌ను కడిగిపారేసిన రాహుల్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ లోక్‌సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానిని, వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ఏకి పడేశారు. అశోకుడి గురించి మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ కర్ర పెత్తనం లేదన్నారు. కానీ బిజెపి కర్రపెత్తనమే చేస్తోందన్నారు. కర్రను ఎల్లప్పుడూ విరిచేయడం జరిగింది. ఆయన అంతేకాక పెగాసస్, నిరుద్యోగం, దేశంలో ఫెడరల్ విధానాన్ని తక్కువ చేయడం, చైనా దురాక్రమణ గురించి ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించినవి.
రెండు భారత్‌లు: దేశంలో రెండు భారత్‌లు ఉన్నాయి. ఒకటి పేదలదైతే, రెండవది ధనవంతులది. ఈ రెండు భారత్‌లో మధ్య అంతరం అంతకంతకు పెరిగిపోతోంది.
నిరుద్యోగం: భారత్‌లో నేడు తయారీ రంగంలో ఉపాధి 46 శాతం మేరకు పడిపోయింది. ఎందుకంటే ప్రభుత్వం అసంఘటిత రంగాన్ని మీరు నాశనం చేశారు. మీరు సూ క్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను దెబ్బతీశారు. మీరు కేవలం 5 నుంచి 10 మంది విషయంలోనే దృష్టిపెట్టారు.
ఏఏ రూపాంతరం: ఏఏ(అంబానీ, అదానీ) వేరియంట్ దేశ ఆర్థిక వ్యవస్థ అంతటా విస్తరిస్తోంది. పెద్ద పరిశ్రమల విషయంలో నాకెలాంటి సమస్య లేదు. మీరు వాటిపైన దృష్టి సారించండి. అలాగే అవి మీకోసం ఉపాధిని పెంచవు అన్న విషయాన్ని కూడా గ్రహించండి. దేశంలో చిన్న, మధ్యకారు పరిశ్రమలే ఉపాధిని కల్పిస్తాయి.
రాష్ట్రాల యూనియన్: భారత్‌ను రాష్ట్రాల యూనియన్ (యూనియన్ ఆఫ్ స్టేట్స్)అంటారు. అంటే ఏమిటి? అంటే తమిళనాడుకు చెందిన నా సోదరుడు, మహారాష్ట్రకు చెందిన నా సోదరికి సమాన హక్కు ఉంటుందని. ఇదే విధంగా ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మణిపూర్, నాగాలాండ్, మిజోరం, ఇతర రాష్ట్రాల సోదరసోదరిమణులకు కూడా సమాన హక్కులు ఉంటాయి.
రాజు భావననే కాంగ్రెస్ తొలగించింది: భారత్‌కు సం బంధించి రెండు విజన్‌లు ఉన్నాయి. ఈ పుష్పగుచ్ఛాన్ని ఏ శక్తి సవాలు చేయలేకపోయింది. 1947లో కాంగ్రెస్ రాజు అన్న భావనను తొలగించింది. ఇప్పుడేమో షహన్ షా(మహారాజులు) ఉన్నారు. ఇప్పుడు మన రాష్ట్రాలు, ప్రజలపై ఒకే భావనతో దాడి చేస్తున్నారు. ఉదాహరణకు ఇండియన్ ఇనిస్టిట్యూషన్ నుంచి తమిళనాడు భావనను మినహాయించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటున్నారు. వారికి గళం లేకుండా పోయింది. పంజాబ్ రైతులు ఎదురొడ్డి నిలుస్తున్నారు. కానీ వారి గళాన్ని వినిపించుకోవడంలేదు. వారిలో చాలా మంది కరోనా మహమ్మారి కాలంలో కూడా నిరసనలు తెలుపుతూ ప్రాణాలు కోల్పోయారు.
నేను ప్రజలందరి నుంచి నేర్చుకున్నాను, మీ నుంచీ నేర్చుకున్నాను : కేరళ ప్రజలకు ఓ సంస్కృతి ఉంది. వారికి తమకంటూ ఓ హుందాతనం ఉంది. వారికో చరిత్ర ఉంది. రాజస్థాన్ ప్రజలకూ ఓ సంస్కృతి ఉంది. వారికి ఓ హుందాతనం, చరిత్ర ఉన్నాయి. వారికంటూ ఓ జీవన విధానం ఉంది. ఇదంతా ఓ పుష్పగుచ్ఛంలా ఉంటుంది. నేను అందరి నుంచి నేర్చుకున్నాను. మీ నుంచీ నేర్చుకున్నాను. కేంద్ర నుంచి కర్ర పెత్తనం చేయవచ్చన్న మరో దృష్టికోణం ఉందని కూడా అర్థమైంది. ప్రతిసారీ ఇది జరుగుతోంది.
మేము జాతీయవాదులం: మేమంతా జాతీయవాదులం. వారి ప్రణాళిక పునాదులు డోక్లాంలో ఏర్పాటుచేశారు. ఇది భారత జాతికి తీవ్ర ముప్పు. మనం జమ్మూకశ్మీర్ విషయంలో పెద్ద వ్యూహాత్మక తప్పిదం చేశాము. మన విదేశీ విధానంలో కూడా తప్పిదం చేశాము. చైనావారు, పాకిస్థానీలు పన్నాగాలు పన్నుతున్నారన్నది చాలా స్పష్టం.
నా తండ్రి ఛిద్రం అయ్యారు : మా తాత 15 ఏళ్ల పాటు కారాగారం అనుభవించారు. మా నాన్నమ్మను 32సార్లు కాల్చి చంపారు. నా తండ్రిని బాం బుతో తునాతునకలు చేశారు. నేను దేని గురించి మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుసు. కానీ మీరు మాత్రం చాలా ప్రమాదకరమైన దానితో చెలగాటమాడుతున్నారు. ఇది ఆపేయాలని నేను మీకు సలహా ఇస్తున్నాను.
భారత్ ఏకాకి అయిపోయింది, చట్టుముట్టబడి ఉంది : గణతంత్ర దినోత్సవానికి ఓ అతిధిని కూడా రప్పించుకోలేకపోవడానికి కారణం ఏమిటో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పుడు భారత్ చాలా ఏకాకి అయింది. చట్టుముట్టబడి ఉంది. చైనా వారికి తామేమి చేయాలనుకున్న ఓ స్పష్టమైన దృష్టికోణం(విజన్) ఉంది.
మీరు చైనాను, పాకిస్థాన్‌ను ఒక్కటి చేశారు: పాకిస్థాన్, చైనాను వేరుగా ఉంచే వ్యూహాత్మక విదేశాంగ విధానం భారత్‌కు ఉండింది. కానీ మీరు ఆ రెండు దేశా లు ఒక్కటయ్యేలా చేశారు. ఆ శక్తులను తక్కువ అంచనా వేయకండి. ఆ శక్తి మన ముందుంది. ఇది భారత్ ప్రజల ఎదుట మీరు ఉంచిన పెద్ద నేరం. చైనాకు స్పష్టమైన విజన్ ఉంది. అది భారత్‌కు లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News