Monday, April 29, 2024

పెద్దన్న చిన్న మనసు.. భారత్ పెద్ద మనసు

- Advertisement -
- Advertisement -

modi trump

 

అమెరికా సహా పలు దేశాల విజ్ఞప్తి మేరకు హైడ్రాక్సీక్లోరోక్విన్, పారాసిటమాల్ మందుల ఎగుమతికి లైన్‌క్లియర్
విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజానికి దన్నుగా నిలవాలన్నదే మా విధానం : భారత విదేశాంగ శాఖ ప్రకటన
భారత్ గనుక మాత్రలను సరఫరా చేయకపోతే ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొందరపాటు హెచ్చరిక

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌తో అల్లాడుతున్న దేశాలకు అత్యవసర మందులను సరఫరా చేస్తామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోన మహమ్మారిని కట్టడి చేయడంలో అద్భుతమైన ఫలితాలనిస్తున్న పారాసిటమాల్, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎగుమతి చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘అంటువ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో మానవతా దృక్పథంతో పారాసిటమాల్, హైడ్రాక్సీక్లోరోక్విన్ మన శక్తిసామర్థాలపై ఆధారపడిన పొరుగు దేశాలకు సరఫరా చేయాలని నిర్ణయించాం. నిర్దిష్ట స్థాయిలో ఎగుమతి చేస్తాం. కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశాలకు కూడా ఎగుమతి చేస్తాం. ఇందులో రాజకీయాలకు ఎటువంటి తావూ లేదు. విపత్కర పరిస్థితులల్లో భారత్ అంతర్జాతీయ సమాజానికి సంఘీభావం తెలుపుతోంది. అన్ని దేశాలు పరస్పర సహకారం అదించుకోవాలన్నదే మా విధానం’ అని క్షవాస్తవ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా కరోనా కట్టడికోసం ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులపై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం గత మార్చి 25న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సాయం కోరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక వేళ భారత్ గనుక తమకు సహకరించనట్లయితే ప్రతీకారం తీసుకుంటామని హెచ్చరించారు. వాణిజ్యపరంగా తమనుంచి అనేక ప్రయోజనాలు పొందిన భారత్‌తో స్నేహసంబంధాలు కొసాగుతాయనే ఆశిస్తున్నట్లు సోమవారం నా టి విలేఖరుల సమావేశంలో ట్రంప్ హెచ్చరించారు. అమెరికానే కాకుండా మరో 20కి పైగా దేశాలు కూడా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సరఫరా చేయాలని భారత్‌ను అభ్యర్థించినట్లు తెలుస్తోంది.

వీటిలో మన పొరుగు దేశాలయిన శ్రీలంక, నేపాల్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యం లో తొలుత మందుల సరఫరాకు ససేమిరా అన్న భారత్ అంతర్జాతీయ ఒత్తిడులను దృష్టి లో ఉంచుకొని ఈ మందుల సరఫరాకు అంగీకరించడం గమనార్హం. ప్రస్తుతానికి కరోనా నివారణకు ఎలాంటి టీకా కానీ, చికిత్స కానీ లేదు. అయితే మలేరియా చికిత్సలో ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఆశాజనక ఫలితాలను ఇస్తుందని పరిశోధకులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ మందుకు డిమాండ్ పెరిగిపోయింది. అమితే భారత అవసరాలకు సరిపోయిన తర్వాత అదనంగా మరో 25 శాతం నిల్వ ఉంచుకొని ఈ మందును ఎగుమతి చేయాలని అనుకొంటున్నట్లు ఓ అధికారి చెప్పారు.

భారత్‌పై ప్రతీకారమే : ట్రంప్
కాగా భారత్ గనుక తమకు హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను సరఫరా చేయకుంటే తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో మలేరియా చికిత్సలో ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్ల వాడకం సత్ఫలితాలనిస్తుందని భావిస్తున్న తరుణంలో ఈ మాత్రలను సరఫరా చేయాలని ట్రంప్ భారత్‌ను కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్‌లో సంభాషణలు జరిపారు. కాగా కోవిడ్19 అమెరికాపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ట్రంప్ సోమవారం శ్వేతసౌధం(వైట్‌హౌస్)లో విలేఖరులతో మాట్లాడారు.

 

India is solidarity with international community
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News