Saturday, April 27, 2024

రికార్డు స్థాయిలో రికవరీలు..

- Advertisement -
- Advertisement -

ఒక్క రోజే కోలుకున్న 36,145 మంది కరోనా బాధితులు
యాక్టివ్ కేసులకన్నా రికవరీలు 4,17,694 ఎక్కువ
మరణాల రేటు సైతం 2.31 శాతానికి తగ్గుదల: కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన

India seen 36145 corona victims recovered in single day

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతం కొనసాగుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొంటున్న పటిష్ట చర్యల వల్ల ఈ వైరస్ బారిన పడి కోలుకొంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. తాజాగా గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 36,145 మంది కరోనా సోకిన వారు పూర్తిగా కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్ల్లారు. దేశంలో కరోనా వైరస్ విజృంభణ మొదలూన తర్వాత ఇంత భారీ సంఖ్యలో రికవరీలు నమోదు కావడం ఇదే మొదటిసారి. కాగా గత కొన్ని రోజులుగా దేశంలో యాక్టివ్ కేసులకన్నా రికవరీలు ఎక్కువగా ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో రికవరీ రేటు ఆదివారం నాటికి మరింత పెరిగి 63.92 శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే మరణాల రేటు కూడా మరింత తగ్గి 2.31 శాతానికి పడిపోయిందని కూడా తెలిపింది. ఆదివారం నాటికి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,85,522గా ఉండగా రికవరీలు 8,85,576గా ఉన్నాయి. యాక్టివ్ కేసులకన్నా వైరస్‌నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,17,694 ఎక్కువగా ఉందని అంటే 1.89 రెట్లు ఎక్కువని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

కాగా మరోవైపు టెస్టుల సంఖ్య కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. వైరస్ వెలుగు చూసిన తర్వాత తొలిసారిగా ఒక్క రోజే 4.40 లక్షలకు పైగా శాంపిల్స్‌ను పరీక్షించడం జరిగింది. ‘గడచిన 24 గంటల్లో 4,42,263 శాంపిల్స్‌ను పరీక్షించడం జరిగింది. దీంతో ప్రతి పది లక్షల జనాభాకు పరీక్షల సంఖ్య (టిపిఎం) మరింత పెరిగి 11,805కు, మొత్తం శాంపిల్స్ పరీక్షలు 1,62,91,331కు చేరుకున్నాయి’ అని ఆ శాఖ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి పదిలక్షల జనాభాకు కనీసం 140 టెస్టులు చేయాల్సి ఉంటుంది. అయితే దేశంలో దాదాపు 19 రాష్ట్రాలు ఇంతకన్నా ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తమిళనాడులో శనివారం ఒక్క రోజే 60 వేలటకు పైగా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం దేశంలో కనోనా పరీక్షలు నిర్వహించడానికి 1307 లేబరేటరీలకు ఐసిఎంఆర్ అనుమతి ఇచ్చింది. వీటిలో 905 ప్రభుత్వ, 402 ప్రైవేటు ల్యాబ్‌లున్నాయి. శనివారం ప్రభుత్వ ల్యాబ్‌లు 3,62,153 టెస్టులు నిర్వహించి రికార్డు సృష్టించగా, ప్రైవేటు ల్యాబ్‌లు సైతం 79,878 శాంపిల్స్ పరీక్షించి కొత్త రికార్డు సృష్టించాయని కేంద్ర ఆరోగ్య శాఖ తన ప్రకటనలో తెలిపింది.

India seen 36145 corona victims recovered in single day

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News