Friday, April 26, 2024

బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం

- Advertisement -
- Advertisement -

India successfully test-fires BrahMos

బాలసోర్ (ఒడిశా): 400 కిమీ దూరం కన్నా ఎక్కువ దూరం లక్షాన్ని ఛేదించే సామర్థం కలిగిన బ్రహ్మాస్ సూపర్‌సోనిక్ క్షిపణి ప్రయోగం బుధవారం విజయవంతమైంది. లక్ష పరిధిని పెంచి ప్రయోగించడం ఇది రెండోసారి. ఒడిశా లోని చాందీపూర్ సమీపాన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజి (ఐటిఆర్) నుంచి డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ (డిఆర్‌డివొ) ఈ క్షిపణిని బుధవారం ఉదయం 10.45 గంటలకు ప్రయోగించింది. ప్రయోగ సమయంలో అన్ని ప్రమాణాలు పాటించినట్టు డిఆర్‌డిఒ అధికారి చెప్పారు.

నేలపై నుంచే కాకుండా సముద్రం లోని ప్లాట్‌ఫారాల నుంచి, యుద్ధ విమానాల నుంచి కూడా ఈ క్షిపణిని ప్రయోగించవచ్చని తెలిపారు. ఈ క్షిపణి మొదటి ప్రయోగం 450 కిమీ దూరం లక్షంలో 2017 మార్చిలో విజయవంతంగా నిర్వహించారు. అలాగే తక్కువ పరిధితో చాందీపూర్ నుంచే 2019 సెప్టెంబర్ 30న బ్రహ్మోస్‌ను ప్రయోగించారు. డిఆర్‌డిఒ, రష్యా సంస్థ ఎన్‌పిఒఎం సంయుక్తంగా ఈ క్షిపణిని రూపొందించాయి. భూమిపై నుంచే కాకుండా జలాంతర్గాముల నుంచి యుద్ధ నౌకల నుంచి, యుద్ధ విమానాల నుంచి క్షిపణిని ప్రయోగించే సామర్దం బ్రహ్మోస్‌కు ఉంది. ప్రపంచం లోనే అత్యంత వేగంగా దూసుకుపోయి లక్షాన్ని సాధించగలదని గుర్తింపు పొందిన ఈ క్షిపణి ఈపాటికే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ వినియోగంలో ఉంటోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News