Saturday, May 4, 2024

అత్యవసరం కాకపోతే ఇరాక్ ప్రయాణం మానుకోండి

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: ఇరాక్‌లోని అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు జరిపిన నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఇరాక్‌కు ప్రయాణాలు మానుకోవాలని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇరాక్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారతీయ పౌరులు అత్యవసరం కాని ప్రయాణాలను మానుకోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ ట్విట్టర్ ద్వారా కోరారు. ఇరాక్‌లో నివసిస్తున్న భారతీయలు అప్రమత్తంగా ఉండాలని, ఆ దేశంలోపల ప్రయాణాలను మానుకోవాలని కూడా ఆయన కోరారు. బాగ్దాద్‌లోని భారతీయ ఎంబసీ, ఎర్బిల్‌లోని భారతీయ కాన్సులేట్ యధావిధిగా పనిచేస్తాయని, ఇరాక్‌లో నివసించే భారతీయులకు అన్ని సేవలను కొనసాగిస్తాయని ఆయన మరో ట్వీట్‌లో తెలిపారు.

India tells its nationals to avoid travel to Iraq, India advises to avoid non-essential travel to Iraq
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News