Monday, April 29, 2024

ఫేస్‌బుక్ ఉపయోగిస్తే చెంప పగలగొట్టడానికి ఓ ఉద్యోగినా?!

- Advertisement -
- Advertisement -

Manish Sethi and slapper

ఎలోన్ మస్క్ ప్రతిస్పందన

వాషింగ్టన్: అతడు అమెరికాలో నివసించే భారతీయుడు. ఒకవిధంగా చెప్పాలంటే ఇండియన్-అమెరికన్. అతడి పేరు మనీశ్ సేథీ. ఆయన ధరించే పరికరాల బ్రాండ్ ‘పావ్‌లోక్’ వ్యవస్థాపకుడు. విచిత్రం ఏమిటంటే తాను ఫేస్‌బుక్ ఉపయోగించేటప్పుడల్లా చెంప పగలగొట్టడానికో ఉద్యోగినిని…అంటే ‘స్లాపర్’ను అతడు పనిలో పెట్టుకున్నాడు.ఆమెను అతడు అమెరికా క్లాసిఫైడ్ అడ్వర్టయిజ్‌మెంట్స్ వెబ్‌సైట్ ‘క్రేగ్స్‌లిస్ట్’ ద్వారా ఆమెను పనిలోకి తీసుకున్నాడు. ఆమెకు గంటకు 8 డాలర్లు చెల్లిస్తాడు. ఆమె చేయాల్సిన పనల్లా తన ప్రక్కన కేఫ్‌లోగానీ, ఇంటిలో గానీ కూర్చుని స్క్రీన్‌ను చూస్తుండాలి. అతడు పనిలోకి ఆమెను పిలవడానికి ముందు “నేను సమయాన్ని వృథా చేస్తున్నప్పుడు, నువ్వు నాపై అరవాలి, లేదా అవసరమనుకుంటే నా చెంప పగలగొట్టాలి” అంటూ 2012లో ఇచ్చిన అడ్వర్టయిజ్‌మెంట్‌లో పేర్కొన్నాడు. ఆ స్లాపర్ వనిత క్లారాను పనిలోకి పెట్టుకున్నాక తన అవాంఛిత ప్రయోగం ఆశ్చర్యకర ఫలితాలు చవిచూశాడు. “సాధారణంగా నా ఉతత్తి (ప్రొడక్టివిటీ) 35 నుంచి 45 శాతం ఉంటుంది. కానీ కారా నా ప్రక్కన కూర్చోడం మొదలయ్యాక నా పనితనం తారాజువ్వలా దూసుకుపోయి 98 శాతానికి పెరిగింది” అని మనీశ్ సేథీ తన బ్లాగ్‌లో పేర్కొన్నాడు. కాగా తొమ్మిది ఏళ్ల తర్వాత తనకు ప్రపంచ సంపన్నుడు ఎలోన్ మస్క్ నుంచి ఎమోజీ లభించిందని పేర్కొన్నాడు. ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో పేర్కొన్న విషయాలు క్రిప్టోకరెన్సీ రేట్లను రికార్డు స్థాయికి పెంచేశాయన్నది ఇక్కడ గమనార్హం. నిజానికి సేథీ కథపై టెస్లా, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు రెండు బ్లేజ్(మంట) ఎమోజీలు పోస్ట్ చేశాడు. దాంతో ఆయన ఫాలోవర్లు కూడా ఈ స్లాపింగ్ ప్రయోగంపై కుతూహలాన్ని పెంచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News