Wednesday, May 1, 2024

ప్రజాస్వామ్య సూచీలో 53 వ స్థానానికి భారత్ పతనం

- Advertisement -
- Advertisement -

India's fall to 53rd position in Democracy Index

 

ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విశ్లేషణ

న్యూఢిల్లీ : 2020 ప్రజాస్వామ్య సూచీ ప్రపంచ స్థాయిలో భారత్ రెండు స్థానాలు దిగజారి 53 వ స్థానానికి చేరుకుందని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వెల్లడించింది. పాలక వర్గాల వల్ల ప్రజాస్వామ్య తిరోగమనం, పౌరహక్కుల అణచివేతలే ఈ దిగజారడానికి కారణంగా వివరించింది. ఏదేమైనా పొరుగుదేశాలతో పోల్చుకుంటే భారత్ స్థాయి ఎక్కువగానే ఉందని పేర్కొంది. ప్రపంచం లోని మొత్తం 167 దేశాల ప్రస్తుత ప్రజాస్వామ్య స్థాయిలను విశ్లేషించే ఈ సూచీలో భారత్ మొత్తం మీద 2019 లోని 6.9 స్కోరు నుంచి 6.61 కి దిగజారిందని వివరించింది.

భారత్ లోని ప్రజాస్వామ్య ప్రమాణాలపై ఒత్తిడి పెరిగి 2014 లో 7.92 స్కోరు నుంచి 2020 లో 6.61 స్కోరుకు దిగజారిందని, అలాగే ప్రస్తుత అధికార వ్యవస్థ వల్ల ప్రజాస్వామ్య తిరోగమనం కారణంగా ప్రపంచ స్థాయిలో 27 స్థానం నుంచి 53 స్థానానికి దిగజారిందని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఇఐయు) విశ్లేషించింది. ప్రజాస్వామ్యానికి సుస్తీ లేదా ఆరోగ్యమా? అన్న శీర్షిక కింద ఇఐయు తాజా ప్రజాస్వామ్య సూచీ నివేదికలో నార్వే అగ్రస్థానంలో ఉందని, అలాగే ఐస్‌ల్యాండ్, స్వీడన్, న్యూజిలాండ్, కెనడా టాప్ ఐదు స్థానాల్లో ఉన్నాయని వివరించింది. మొత్తం 167 దేశాల్లో ప్రజాస్వామ్య సూచీ 23 దేశాలను పూర్తి ప్రజాస్వామ్య దేశాలుగా వర్గీకరించింది. 52 ప్రజాస్వామ్య లోపాలతో కూడిన దేశాలు గాను, 35 సంకీర్ణ ప్రభుత్వ దేశాలుగా, 57 అధికార జులుం సాగించే దేశాలుగా, వర్గీకరించింది. భారత్‌ను ప్రజాస్వామ్య లోపాలున్న దేశంగా వర్గీకరించింది. అలాగే అమెరికా, ఫ్రాన్స్, బెల్జియం, బ్రెజిల్ దేశాలను ఇదే కేటగిరి కింద వర్గీకరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News