Monday, May 6, 2024

రాజస్థాన్‌లో భారత్‌-అమెరికా సంయుక్త సైనిక ‘యుధ్ అభ్యాస్’

- Advertisement -
- Advertisement -

Indo-US joint Military exercise 'Yudh Abhyas' begins

 

బికనీర్ (రాజస్థాన్): భారత్-‌అమెరికా సంయుక్త సైనిక 16 వ విన్యాసాలకు సంబంధించి రాజస్థాన్‌లో యుధ్ అభ్యాస్ సోమవారం ప్రారంభమైంది. రాజస్థాన్ పశ్చిమ విభాగం మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్‌లో ప్రారంభమైన ఈ సైనిక శిక్షణ కార్యక్రమంలో అమెరికా రక్షణ దళానికి భారత్ బ్రిగేడియర్ ముఖేష్ భన్వాలా స్వాగతం పలికారు. రెండు దేశాల సైనిక దళాల మధ్య ఆలోచనల దృక్పధాన్ని, ఉత్తమశిక్షణను పంచుకోవడం అవసరమని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అనేక వైమానిక వేదికలు, స్వదేశీ అత్యంత ఆధునిక తేలికపాటి హెలికాప్టర్ డబ్లుస్‌ఐ రుద్ర, ఎంఐ 17,చినూక్స్,అమెరికా ఆర్మీకి చెందిన స్ట్రైకెర్ వాహనాలు , భారత ఆర్మీకి చెందిన బిఎంపి 2 మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీ కొంబట్ వాహనాలు, ఉపయోగిస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News