Monday, April 29, 2024

నగరంలో మరిన్ని నిఘా నేత్రాలు

- Advertisement -
- Advertisement -

Installation of more CCTV cameras in Hyderabad

హైదరాబాద్: నగరంలో మరిన్ని నిఘా నేత్రాలు ఏర్పాటు కానున్నాయి. నగర వాసుల భద్రతతో పాటు సురక్షతకు పెద్దపీట వేయనున్నారు. ఇందుకు సంబంధించి నగరంలో ఇప్పటీ వరకు సిసి కెమెరాలు లేని పలు కీలక ప్రాంతాల్లో పాటు అవసరమైన ప్రతి చోట్ల కొత్తవి ఏర్పాటు చేయాలంటూ జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఓఆర్‌ఆర్ పరిధిలో పూర్తిస్థాయి భద్రతకు పౌరుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సకల్పించిన ప్రభుత్వం ఇందులో భాగంగా పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు గ్రేటర్ పరిధిలో పబ్లిక్ సేప్టీ అండ్ సెక్యూరిటీ పై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా పురపాలక శాఖ అదేశాల మేరకు జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. సిసికెమెరాల ఏర్పాటుకు సంబంధించి జోనల్ కమిషనర్‌తో పాటు ప్రభుత్వ వివిధ శాఖల విభాగాల అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నెల లోపు సిసి కెమెరాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని 30 శాఖలకు సంబంధించి ఎవరికి వారు వారి వారి పరిధిలో వచ్చే ప్రదేశాలలో నెల రోజుల లోపు సిసి కెమెరాలను ఏర్పాటు చేయాల్సిందిగా కమిషనర్ సూచించారు.

వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేయనున్న సిసి కెమెరాలు…

అన్ని మురికి వాడలు, డబుల్ బెడ్ రూం కాలనీలు, బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మెట్రో స్టేషన్లతో పాటు ఎంపిక చేసిన మెట్రో పిల్లరు, ఎంఎంటిఎస్ స్టేషన్, రైల్వే స్టేషన్లు, బస్సు డిపోలు, బస్సుల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని సంబంధిత విభాగాల అధిపతులను ఆదేశించారు. అదేవిధంగా 600 చదరపు గజాల స్థలంలో నిర్మిణాలు, లేఅవుట్‌లు, అపార్ట్‌మెంట్, వాణిజ్య షాపుల్లో తప్పనిసరిగా సిసి కెమెరాల ఏర్పాటు చేయాలని తప్పని సరి నిబంధనను టిఎస్ బిపాస్‌లో పొందపర్చేవిధంగా చర్యలు తీసుకుకోవాలని సిసిపిని సూచించారు. అదేవిధంగా బస్ బేలు, బస్ షెల్టర్లు, అన్ని మతపరమైన ప్రదేశాల్లో ప్రవేశ మార్గాలు, చెరువులు, పార్కుల ప్రవేశ మార్గాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.

ఓఆర్‌ఆర్‌తో పాటు అండర్ పాస్ మార్గాలు, ఐటి పార్కులు, జిహెచ్‌ఎంసి95 ట్రాన్స్‌పర్ ప్టేషన్లు, అన్ని షెల్టర్ హోమ్‌లు, అనాధ ఆశ్రమాలు, సంఘీక సంక్షేమ హాస్టళ్లు,. అన్ని పిజీ హాస్టళ్లు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, ప్రైవేట్, రెసిడేన్సియల్స్, విద్యాసంస్థలు, పారిశ్రామిక వాడలు, ఓఆర్‌ఆర్ ఇంటర్ చెంజ్ పాయింట్లు, లాజిస్టిక్స్ పార్కులు, అన్ని హోల్‌సేల్ మార్కెట్లు, రైతు బజార్ల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. పోలీసు శాఖ గుర్తించిన స్ట్రీట్ వెండర్స్, హాకర్స్ జోన్లు, కాలనీలోని టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ ఆఫీసులు, మీ సేవా సెంటర్లు, జిహెచ్‌ఎంసి పరిధితో పాటు ఓఆర్‌ఆర్ లోపల గల అన్ని షాపుల ముందు భాగంతో పాటు ప్రవేశ ద్వారాలు, ఓలా, ఉబర్ అద్దె వాహనాలు అధికంగా ఉండే ప్రదేశాలు, పోలీసులు గుర్తించిన సమస్యత్మక ప్రదేశాలతో పాటు పబ్లిక్ టాయిలెంట్ల వద్ద ముందుబాగంలో రోడ్డు కనిపించేలా సిసి కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు పోలీసుల శాఖ గుర్తించిన, గుర్తించే అన్ని ప్రదేశాల్లో ఎప్పటిప్పుడు సిసి కెమెరాలను ఏర్పాటు చేయాల్సిందిగా కమిషనర్ ఆయా శాఖల సంబంధిత అధికారులను ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News