Monday, May 6, 2024

గోపీచంద్‌కు సరైన స్క్రిప్ట్

- Advertisement -
- Advertisement -

Interview with Director B. Gopal

గోపీచంద్, నయనతార హీరో హీరోయిన్లుగా మాస్ డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ మీద తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు బి.గోపాల్‌తో ఇంటర్వూ …

తండ్రీ కొడుకుల కథ…

‘ఆరడుగుల బుల్లెట్’ ఓ కమర్షియల్ సినిమా. తండ్రీ కొడుకుల మధ్య జరిగే కథ. ఆకతాయి కొడుకుని తండ్రి దూరంగా పెట్టడం… ఆతర్వాత ఆ కుటుంబం కష్టాల్లో ఉంటే ఆ కొడుకే వచ్చి కాపాడతాడు. ఆ తండ్రి కొడుకును ఎంతలా అపార్ఠం చేసుకున్నాడు.. ఎంతలా మిస్ అయ్యాడు.. ఆ ఫ్యామిలీని అతను ఎలా కాపాడాడు? అనేదే కథ.

సంగీతం బాగుంది…

ఈ చిత్రానికి మణిశర్మ ఇచ్చిన సంగీతం బాగుంది. ఆయన సమరసింహారెడ్డి, ఇంద్ర… ఇలా ఎన్నో సినిమాలకు మంచి పాటలు ఇచ్చారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ ఓ హైలైట్‌గా ఉంటుంది.

గోపీచంద్‌కు సరైన స్క్రిప్ట్…

తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం, నయనతారతో లవ్ స్టోరీ, విలన్స్‌తో క్లాష్ హై ఓల్టేజ్‌గా ఉంటుంది. గోపీచంద్‌కు సరైన స్క్రిప్ట్ ఇది. ఆకతాయి కొడుకు, క్రమశిక్షణ కలిగిన తండ్రి అనే కాన్సెప్ట్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో ఎమోషన్స్ బాగుంటాయి. వక్కంతం వంశీ కథ, అబ్బూరి రవి మాటలు బాగున్నాయి. అందరికీ సబ్జెక్ట్ నచ్చే ఈ చిత్రాన్ని చేశాం. వక్కంతం వంశీ కథ నిర్మాతలకు, గోపీచంద్ సహా అందరికీ నచ్చడంతోనే మొదలుపెట్టాం.

కథ నచ్చితేనే…

నేను చేసినవి ఏవీ కూడా నా కథలు కాదు. సీనియర్ రచయితలు,కొత్త రచయితలను అందరినీ అడుగుతుంటాను. మస్కా సినిమాతో కొత్త రచయితను పరిచయం చేశాను. చిన్ని కృష్ణను కూడా నేనే పరిచయం చేశాను. నాకు కథ నచ్చితేనే సినిమాకు న్యాయం చేయగలుగుతాను.

అందుకే బ్లాక్‌బస్టర్ హిట్లు…

స్క్రిప్ట్ బాగుంటే సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. లేదంటే ఫ్లాప్ అవుతాయి. ‘క్రాక్’ జనాలకు నచ్చింది. కాబట్టే సూపర్ హిట్ అయింది. ప్రేక్షకులకు నచ్చడంతో సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, ఇంద్ర బ్లాక్‌బస్టర్ హిట్లు అయ్యాయి.

ఆ కోరిక ఉంది…

సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, ఇంద్ర సమయంలో ఫ్యాక్షన్ సినిమా చేస్తున్నానని అనుకోలేదు. ఇప్పుడు కూడా ఎవరైనా కథ చెబితే.. ఫ్యాక్షన్ డ్రాప్‌లో డైరెక్షన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. బాలయ్య బాబుతో మరో సినిమా చేయాలని చాలా ప్రయత్నించాను. కానీ స్క్రిప్ట్ సరిగ్గా రాకపోవడంతో ఆలస్యమవుతూ వస్తోంది. బాలయ్యతో సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి కంటే బ్లాక్‌బస్టర్ హిట్ తీయాలనే కోరిక ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News