Sunday, April 28, 2024

మహేష్‌ని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూస్తారు

- Advertisement -
- Advertisement -

Producer Anil Sunkara

 

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అనిల్ సుంకరతో ఇంటర్వూ విశేషాలు…

చాలా బాగా వచ్చింది…
సినిమా డబ్బింగ్ దగ్గరి నుండి ప్రతీది పూర్తయ్యాయి. సెన్సార్ ఒక్కటే మిగిలి ఉంది. అది కూడా మరో రెండు రోజుల్లో అయిపోతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. మహేష్ బాబుని అందరూ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూస్తారు.

మళ్లీ ఇన్నాళ్లకు…
విజయశాంతితో కలిసి మహేష్ బాబు నటించినప్పుడు ఆయనకు 13 ఏళ్లు. మళ్లీ ఇన్నాళ్ళకు వాళ్లు ఇద్దరూ కలిసి నటించారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఉండే సీన్స్ చాలా బావుంటాయి.

అంతకు మించిన వినోదం…
యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా అనగానే ఎంటర్‌టైన్‌మెంట్ గుర్తుకు వస్తుంది. కానీ ఈ సినిమాలో అంతకు మించి ఉండబోతోంది. ఈ సినిమా చూశాక శంకర్ సినిమా స్థాయిలో ఎంటర్‌టైన్‌మెంట్ చూసినట్టుగా ఉంటుంది.

చప్పట్లు, విజిల్స్…
సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు చప్పట్లు కొడుతూనే ఉంటారు… విజిల్స్ వేస్తూనే ఉంటారు. ఇవి రెండూ కాకుండా భావోద్వేగానికి కన్నీళ్లు పెట్టుకుంటారు.

సమ్‌థింగ్ స్పెషల్‌గా…
సినిమాలో ఆర్మీ మేజర్‌లా మహేష్ బాబు స్క్రీన్‌పై ఎంతసేపు ఉంటాడన్నది పక్కన పెడితే… ప్రతి సందర్భం ఆయన ఆర్మీ మేజర్ అని గుర్తు చేస్తూనే ఉంటుంది. మహేష్ కెరీర్‌లో సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుంది ఈ చిత్రం.

అస్సలు సంబంధం ఉండదు…
కర్నూల్ బ్యాక్‌డ్రాప్ అనగానే ‘ఒక్కడు’ సినిమా గుర్తుకు వస్తుంది. కానీ ఈ సినిమాలో కర్నూలు అనేది కథలో ఓ భాగం. ఈ సినిమాకు ఆ సినిమాకు అస్సలు సంబంధం ఉండదు.

ఇంకొకరిని ఊహించుకోలేరు…
మహేష్ బాబును దృష్టిలో పెట్టుకొని దేవిశ్రీ ప్రసాద్ పాటలను కంపోజ్ చేశాడు. ఈ పాటలను విన్న తరవాత మహేష్ బాబును తప్ప ఇంకొకరిని ఊహించుకోలేరు. అంత మంచి పాటలను ఇచ్చాడు. రీ రికార్డింగ్ కూడా సందర్భానికి తగ్గట్టు కంపోజ్ చేశాడు.

అందుకే ఈ టైటిల్…
టైటిల్ ‘సరిలేరు నీకెవ్వరు’ అనేది హీరోకి సంబంధించినది కాదు. భారతీయ సైనికులకు సంబంధించినది. దేశరక్షణ కోసం తమ పిల్లలను ఎక్కడికో పంపుతున్న తల్లిదండ్రులకు వర్తిస్తుంది. సినిమాలో దీనికి జస్టిఫికేషన్ ఉంటుంది.

Interview with Film Producer Anil Sunkara
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News