Wednesday, May 1, 2024

‘వరల్డ్ ఫేమస్ లవర్’ టార్గెట్ లవర్సే

- Advertisement -
- Advertisement -

KS Rama Rao

 

యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’. వాలెంటైన్స్ డే కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ.వల్లభ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని కె.ఎస్.రామారావు సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి నిర్మాత కె.ఎస్. రామారావు మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

అందుకే నలుగురు హీరోయిన్లు…
ఈ సినిమాలో కథను బట్టే హీరోయిన్లు ఉంటారు. ఈ కథకి నలుగురు అమ్మాయిలు అవసరమే. అందుకే రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజాబెల్లే లెయితేలను హీరోయిన్లుగా తీసుకున్నాం.

ప్రత్యేకమైన ఆర్టిస్ట్…
విజయ దేవరకొండ నటించిన ‘పెళ్లి చూపులు’ చూసినప్పుడే అతను ప్రత్యేకమైన ఆర్టిస్ట్ అనిపించాడు. అలా చాలా తక్కువ మంది ఉంటారు. రవితేజ కూడా అలాంటివాడే. ఏదో ప్రత్యేకత ఉంటుంది వారిలో.

కొత్త తరహా దర్శకుడు…
క్రాంతి మాధవ్ కొత్త తరహా దర్శకుడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఉండాలనే ‘ఓనమాలు’ చేశాడు. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ కూడా అలాంటిదే. కల్చర్ సినిమాలే చేస్తాడు. ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్తే సినిమా కొత్తగా ఉందని ఫీలయ్యే చిత్రాలే చేస్తాడు.

టార్గెట్ లవర్సే…
‘వరల్డ్ ఫేమస్ లవర్’ టార్గెట్ లవర్సే. అది యూత్‌లో ఉండే లవర్స్ కావచ్చు… మిడిల్ ఏజ్‌లో ఉండేవాళ్లు కావచ్చు. ముసలివాళ్లు కావచ్చు. ప్రేమ అనేది ఎవరికైనా ఒక్కటే.

అందుకే నిర్మాణంలో భాగమయ్యారు…
మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతో అభిషేక్ నామా కూడా ఈ సినిమాలో భాగమయ్యాడు. దాంతో పాటు విజయదేవరకొండతో సినిమా చేయాలని చాలా మంది నిర్మాతలు అనుకుంటూ ఉంటారు. అయితే అందరికీ విజయ్ దేవరకొండ అందుబాటులో లేడు. అందుకే ఈ సినిమాతో ఆయన కలిశాడు. ఇక అభిషేక్ నామా ఆంధ్రా ఏరియాకి, సునీల్ నారాయణ నిజామ్ ఏరియాకు గాను నిర్మాణంలో భాగమవ్వడం జరిగింది.

అతనికి తగ్గ టైటిల్…
యంగ్ స్టార్ విజయ్ దేవరకొండకి తగ్గ టైటిల్ ఇదని నా ఫీలింగ్. అతను మామూలుగానే వరల్డ్ ఫేమస్ లవర్.

Interview with KS Rama Rao
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News