Friday, April 26, 2024

ఆత్మవిశ్వాసంతో కోహ్లి సేన

- Advertisement -
- Advertisement -

ఆత్మవిశ్వాసంతో కోహ్లి సేన
నేడు పంజాబ్‌తో పోరు

దుబాయి: తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగే రెండో మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఓటమి పాలైన పంజాబ్ తొలి గెలుపే లక్షంగా పోరుకు సిద్ధమైంది. ఢిల్లీపై అసాధారణ ఆటను కనబరిచినా పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు హైదరాబాద్‌పై అలవోక విజయాన్ని అందుకున్న బెంగళూరు ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బెంగళూరు సమతూకంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన బెంగళూరు ఈసారి కూడా గెలుపే లక్షంగా పోరుకు సిద్ధమైంది. ఓపెనర్లు దేవ్‌దూత్ పడిక్కల్, అరోన్ పించ్‌లు ఈ మ్యాచ్‌లో కూడా మెరుపులు మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. పడిక్కల్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక, ఫించ్ చెలరేగితే కట్టడి చేయడం ప్రత్యర్థి బౌలర్లకు చాలా కష్టం. మరోవైపు డివిలియర్స్ రూపంలో అరుదైన అస్త్రం ఉండనే ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాట్స్‌మెన్, బౌలర్లకు జట్టులో కొదవలేదు. తొలి మ్యాచ్‌లో విఫలమైన కెప్టెన్ విరాట్ కోహ్లి ఈసారి మెరుపులు మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతను విజృంభిస్తే భారీ స్కోరు సాధించడం బెంగళూరు ఏమాత్రం కష్టం కాదు. ఇక బౌలింగ్‌లోనూ బెంగళూరుకు ఎదురు లేదు. చాహల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. స్టెయిన్, ఉమేశ్ యాదవ్, శివమ్ దూబే, సైని తదితరులతో బెంగళూరు బౌలింగ్ చాలా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా కోహ్లి సేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
తొలి గెలుపు కోసం
మరోవైపు పంజాబ్ ఐపిఎల్‌లో తొలి విజయం సాధించాలనే పట్టుదలతో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఢిల్లీ చేతిలో అనూహ్య ఓటమి పాలైన పంజాబ్ ఈసారి గెలుపే లక్షంగా బరిలోకి దిగుతోంది. ఆరంభ మ్యాచ్‌లో అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన మయాంక్ అగర్వాల్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అతను విజృంభిస్తే పంజాబ్‌కు భారీ స్కోరు కష్టమేమి కాదు. ఇక కెప్టెన్ రాహుల్ కూడా బ్యాట్‌ను ఝులిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆరంభ మ్యాచ్‌లో రాహుల్, మ్యాక్స్‌వెల్, పురాన్ తదితరులు విఫలమయ్యారు. దీంతో పంజాబ్ స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక పోయింది. ఈసారి మాత్రం మెరుగైన ఆటతో బెంగళూరును కంగుతినిపించాలనే పట్టుదలతో మ్యాచ్‌కు సిద్ధమైంది.

IPL 2020: RCB vs KXIP Match Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News