Saturday, May 4, 2024

రాహుల్ అర్థశతకం..

- Advertisement -
- Advertisement -

IPL 2021: KL Rahul hits 50 against RCB

అహ్మదాబాద్‌: ఐపిఎల్‌ 2021లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కెప్టెన్ కెఎల్ రాహుల్ అర్థశతకం బాదాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్
ప్రభు సిమ్రాన్‌(7) తొలి వికెట్ గా పెవిలియన్‌ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన క్రిస్‌గేల్‌, బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో పంజాబ్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే, దూకుడుగా ఆడే క్రమంలో గేల్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నికోలన్ పూరన్(0) మరోసారి నిరాశపర్చాడు. ప్రస్తుతం పంజాబ్ జట్టు 14 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్‌(55), దీపక్ హుడా(05)లు ఉన్నారు.

IPL 2021: KL Rahul hits 50 against RCB

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News