Monday, May 6, 2024

మూడు వికెట్లు కోల్పోయిన బెంగళూరు..

- Advertisement -
- Advertisement -

IPL 2021: RCB lost 3 wickets against SRH

చెన్నై: ఐపిఎల్‌ 2021‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న యువ ఓపెనర్‌ దేవదత్ పడిక్కల్‌(11)ను భువనేశ్వర్‌ కుమార్‌ ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన షాబాజ్‌ అహ్మద్(14)ను‌ నదీవ్‌ పెవిలియన్ కు పంపించాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండడంతో కోహ్లీ కూడా ఆచితూచి ఆడుతున్నాడు. కోహ్లీకి జత కలిసిన గ్లెన్‌ మాక్స్‌వెల్ గేర్ మార్చి బౌండరీలతో సన్ రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కోహ్లీ(33) కూడా ధాటిగా ఆడే క్రమంలో హోల్డర్ బౌలింగ్ భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో బెంగళూరు 13 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది ప్రస్తుతం క్రీజులో మాక్సీ(28), ఎబి డివిలియర్స్(0) లు ఉన్నారు.

IPL 2021: RCB lost 3 wickets against SRH

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News