Saturday, May 11, 2024

చెన్నైకి మరో గెలుపు

- Advertisement -
- Advertisement -

IPL 2022: CSK win by 13 runs against SRH

చెన్నైకి మరో గెలుపు
హైదరాబాద్‌పై 13 పరుగుల తేడాతో విజయం
పుణె: ఐపిఎల్‌లో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రెండో విజయాం నమోదు చేసింది. ధోనీ మళ్లీ పగ్గాలు చేపట్టాడన్న సంతోషమో మరో కారణమో తెలియదు కానీ సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఆటగాళ్లు చెలరేగిపోయారు. అటు బ్యాట్స్‌మెన్‌తో పాటుగా ఇటు బౌలర్లు కూడా చెలరేగడంతో13 పరుగుల తేడాతో ఘన విజయం చేసింది. తొలుత బ్యాట్ చేసిన చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వేలు చెలరేగడంతో 2 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు సాధించింది. 203 పరుగుల విజయ లక్షంతో బరిలోకి దిగిన హైదరాబాద్ మొదట్లో దూకుడుగా ఆడినా ఆ తర్వాత వరసగా వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు నష్టానికి 189 పరుగులు మాత్రమే చేసింది. నికోలస్ పూరన్ 64 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, విలియమ్సన్ 47, అభిషేక్ శర్మ 39 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి 4 వికెట్లు పడగొట్టగా, సాంటర్న్, ప్రిటోరియస్ చెరో వికెట్ సాధించారు.
చెలరేగిన రుతురాజ్, కాన్వే
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే విజృంభణతో 2 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆదిలో ఆచితూచి ఆడిన వీరిద్దరూ ఆ తర్వాత చెలరేగి పోయారు. తొలి వి కెట్‌కు 183 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని సా ధించారు. ఈ క్రమంలో శతకం వైపుగా దూసుకెళ్తున్న రుతురాజ్ దురదృష్టవశాత్తు ఒక్క పరుగు తే డాలో శతకాన్ని చేజార్చుకున్నాడు. 57 బంతుల్లో 6 ఫోర్లు, మరో ఆరు సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసిన రుతురాజ్ నటరాజన్ బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రుతురాజ్ ఔటయిన తర్వాత వచ్చిన ధోనీ కేవలం 8 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో వైపు కాన్వే 55 బంతుల్లో 8 ఫోర్లు, 4సిక్సర్లతో 85 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జడేజా ఒక పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. సన్‌రైజర్స్ బౌలర్లకు దక్కిన దక్కిన రెండు వికెట్లు నటరాజన్‌కే లభించాయి.

IPL 2022: CSK win by 13 runs against SRH

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News