Friday, April 26, 2024

వాళ్లు లేకున్నా ఐపిఎల్ ఆగదు: రాజీవ్ శుక్లా

- Advertisement -
- Advertisement -

ముంబై: కరోనా వైరస్ దెబ్బకు అర్ధాంతరంగా ఆగి పోయిన ఐపిఎల్ రెండో దశ మ్యాచ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించి తీరుతామని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తదితర దేశాలకు చెందిన క్రికెటర్లు అందుబాటులో లేకున్నా ఐపిఎల్‌ను నిర్వహిస్తామని, ఈ విషయంలో మరో ప్రశ్నకు తావేలేదన్నారు. యూఎఇ వేదికగా ఐపిఎల్ మిగిలిన దశను పూర్తి చేస్తామన్నారు. ఈ దిశగా తాము ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించామన్నారు. విదేశీ క్రికెటర్లు ఐపిఎల్‌కు అందుబాటులో లేకున్నా ఐపిఎల్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందన్నారు. ఇక ఐపిఎల్‌కు తమ క్రికెటర్లను పంపాలా వద్దా అనేది ఆయా క్రికెట్ బోర్డుల నిర్ణయమన్నారు. దీనిలో తాము ఎలాంటి జోక్యం చేసుకోమన్నారు. ఇక విదేశీ ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా ఐపిఎల్ విజయవంతంగా సాగుతుందనే నమ్మకం తమకుందున్నారు. ప్రతిభావంతులైన స్వదేశీ క్రికెటర్లతో ఐపిఎల్‌ను కొనసాగిస్తామని శుక్లా వివరించారు.

IPL not Stop if whoever is not available: Rajeev Shukla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News