Monday, May 6, 2024

సెంట్రల్ విస్టా ఇప్పుడు అవసరమా?

- Advertisement -
- Advertisement -

Is the Central Vista project needed?

 

న్యూఢిల్లీ : కరోనా సంబంధిత అనారోగ్య సంక్షోభ దశలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు అవసరమా? అని మాజీ బ్యూరోక్రాట్లు ప్రశ్నించారు.

పరిపాలనా రంగంలో విశేషానుభవం 60 మంది మాజీ అధికారులు ప్రధానికి ఓ లేఖ రాశారు. రాజధాని ఢిల్లీలో అత్యంత ప్రముఖుల నివాసాలు, కట్డాలు ఉండే ప్రాంతాల సుందరీకరణ పేరిట కేంద్రం భారీ స్థాయిలో సెంట్రల్ విస్టా పనులు చేపట్టింది. దీని నిర్మాణ వ్యయం దాదాపు రూ 20000 కోట్లుగా అంచనా వేశారు. ప్రజా ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన దశలో ఈ ప్రాజెక్టుకు ఇంత భారీ వ్యయం పట్ల ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది బాధ్యతారాహిత్యమే అవుతుందన్నారు. నిజానికి ఇది రోమ్ తగులబడుతూ ఉంటే నిరో ఫిడేలు వాయించినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర పట్టణాభివృద్ధి, హౌసింగ్ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి కూడా లేఖ ప్రతిని పంపించారు.

ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి పార్లమెంటరీ చర్చలు, తదితర విధానాలు పాటించకుండానే నిర్ణయం తీసుకున్నారని, ఇది పద్థతి కాదని పేర్కొన్నారు. అంతేకాకుండా పునర్నిర్మాణ పనులపై ప్రజలతో సంప్రదింపులు లేకపోవడం, నిపుణుల అభిప్రాయాలు తీసుకోకపోవడం అనుచితం అని తెలిపారు. ప్రాజెక్టుకు సంస్థ ఎంపిక, చేపట్టిన ప్రక్రియ అన్నీ కూడా జవాబులు లేని ప్రశ్నలుగా మారాయని ఈ లేఖలో ఆక్షేపించారు. ప్రజల ఆరోగ్యానికి ఎక్కువ నిధులు కేటాయించాల్సి ఉంది. దీనిని పక్కన పెట్టి ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు ఖర్చు పెట్టడం అవసరమా? అని నిలదీశారు. లేఖపై రిటైర్డ్ ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు, డిడిఎ మాజీ వైస్ ఛైర్మన్ విఎస్ ఐలావాది, ప్రసార భారతి మాజీ సిఇఒ జవహర్ సర్కార్ ఇతరులు సంతకాలు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News