Saturday, May 11, 2024

చంద్రయాన్ 3 మరింత ఎత్తులోకి..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : చంద్రయాన్ 3 కక్ష హెచ్చింపు ప్రక్రియలో నాలుగో దశను ఇస్రో గురువారం విజయవంతంగా నిర్వహించింది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ,ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ (ఇస్ట్రాక్) నుంచి ఈ సంబంధిత ఇంజిన్ల జ్వలనంతో ఈ ప్రక్రియ సజావుగా సాగింది. దీనితో భూ కక్ష వీడుతూ ఇక చంద్రయాన్ 3 వ్యోమనౌక చంద్రుడి వైపు ప్రయాణంలో మరో అడుగు ముందకేసినట్లు అయింది. తరువాతి జ్వలన ప్రక్రియ ఈ నెల 25న మధ్యాహ్నం రెండు మూడు గంటల మధ్య నిర్వహిస్తారు. చంద్రుడివైపు పయనంలో ఓ అడుగు ముందుకేసి ఇస్రో ఇప్పుడు

అంతర్జాతీయ చంద్రుడి దినోత్సవంలో ప్రతీకాత్మకంగా పాల్గొందని ఇస్రోవర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ మూడో దఫా ప్రక్రియ విజయవంతంతో చంద్రయాన్ 3 సజావుగా సాగుతున్నట్లు స్పష్టం అయింది. అంతకు ముందు స్పేస్ సైన్స్ టెక్నాలజీ అండ్ అవేర్‌నెస్ ట్రైనింగ్ (స్టార్ట్) కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడారు. చంద్రయాన్ సజావుగా సాగుతోందని , మరికొద్దిరోజులలో ఇది చంద్రుడిపై వాలుతుందని తెలిపారు. శాస్త్రీయ అంశాలకు సంబంధించి ఇస్రో చంద్రయాన్ 3 అత్యంత ప్రత్యేకమైన ఫలితాలను ప్రపంచానికి అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News