Wednesday, May 1, 2024

ఇవాంక ట్రంప్ వ్యక్తిగత సహాయకురాలికి కరోనా

- Advertisement -
- Advertisement -

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారుగా వ్యవహరిస్తున్న ఇవాంక ట్రంప్ వ్యక్తిగత సహాయకురాలికి కరోనా సోకింది. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. దీంతో కరోనా బారిన పడిన శ్వేతసౌధం సిబ్బంది సంఖ్య మూడుకు చేరింది. అయితే, ముందు జాగ్రత్తగా ఇవాంక, ఆమె భర్త కుష్నర్ లకు‌ కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలకు నిర్వహించగా.. వారిద్దరికీ నెగెటివ్‌గా తేలింది. కరోనా పాజిటివ్‌గా తేలిన పర్సనల్ సెక్రటరీ గత కొన్ని వారాలుగా ఇవాంకతో లేరని.. దీంతో ఎలాంటి ప్రమాదం లేదని వైట్‌హౌజ్‌ స్పష్టం చేసింది. ఇటీవల, ఉపాధ్యాక్షుడు మైక్ పెన్స్ మీడియా ప్రతినిధిగా వ్యవహరిస్తున్న కేటీ మిల్లర్ అనే మహిళకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. కేటీ మిల్లర్ విధి నిర్వహణలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, పాధ్యాక్షుడు మైక్ పెన్స్ పాల్గొన్న పలు సమావేశాలకు కేటీ మిల్లర్ హాజరయ్యారు. దీంతో ట్రంప్‌, మైక్ పెన్స్ లకు కరోనా పరీక్షలు చేయగా.. నెగెటీవ్ అని తేలింది. అప్పటినుంచి వైట్‌హౌజ్ లో‌ కరోనా సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

Ivanka Trump’s PA Tests Positive for Covid 19: White House

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News