Monday, April 29, 2024

జడ్చర్లను పరిశ్రమల, ఐటి హబ్‌గా మారుస్తా: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

- Advertisement -
- Advertisement -

జడ్చర్ల : జడ్చర్లను పరిశ్రమల, ఐటీ హబ్‌గా మారుస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని కల్వకుర్తి రోడ్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసిఆర్‌కి దక్కిందన్నారు. గతంలో తాగునీరు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత 70 సంవత్సరాల పాలనలో రోడ్లు కూడా వేయించలేకపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటు , బీటీ రోడ్లు, సీసీ రోడ్లు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.

గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొన్నదన్నారు. ప్రతి గ్రామంలో బోనాలు కోట మైసమ్మ బొడ్రాయి వంటి పండుగలు జరుపుకుంటున్నారన్నారు. పోలేపల్లిలో సెజ్ ఏర్పాటుతో వేలాది మందికి ఉపాధి దొరికిందని తెలిపారు. జడ్చర్ల పట్టణం రోజు రోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ , రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అదే విధంగా పట్టణ జనాభా లక్ష వరకు ఉందని, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు బైపాస్ రోడ్డును కూడా మంజూరు చేయాలని కోరడంతో సీఎం కేసిఆర్ స్పందిస్తూ ఎన్నికలు ముగిసిన తక్షణమే హామీలు అమలయ్యేలా చేస్తానని తెలిపారు.

ఉదండాపూర్ రిజర్వాయర్‌కు నీళ్లు అందించి జడ్చర్ల నియోజకవర్గంలో రూ. 1,50,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మాజీ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ , సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రనీల్‌చందర్, మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ, ముడా డైరెక్టర్లు రవిశంకర్, శ్రీకాంత్ , మున్సిపల్ వైస్ చైర్మన్ సారిక, కౌన్సిలర్లు కాటేమోని శంకర్ , కోట్ల ప్రశాంత్‌రెడ్డి, ఉమాశంకర్‌గౌడ్, సతీష్, రమేష్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News