Monday, May 6, 2024

అక్టోబర్ 26న సామాన్యుడితో జపాన్ రాకుమారి పెళ్లి

- Advertisement -
- Advertisement -

Japanese Princess Mako to marry commoner

టోక్యో: జపాన్ రాకుమారి మాకో తన ప్రియుడు కొమురోను ఈ నెలాఖరులో వివాహం చేసుకోనున్నారు. ఏళ్ల తరబడి సాగిన వీరి ప్రేమ వివాదం చివరికి వివాహ బంధంతొ ఒక కొలిక్కి రానున్నది. కొమురో తల్లికి సంబంధించిన ఒక ఆర్థిక వివాదం కారణంగా ఈ జంట వివాహాన్ని రాజకుటుంబంతోపాటు ప్రజలు కూడా పూర్తిగా సమర్థించడం లేదని ఇంపీరియల్ హౌస్‌హోల్డ్ ఏజెన్సీ తెలిపింది. ఈ వివాదం కారణంగా మాకో-కొమురోల వివాహం మూడేళ్లుగా వాయిదాపడుతూ వచ్చింది. వివాహం తర్వాత మాకో తన రాజకుమార్తె హోదాను, రాచరికాన్ని కోల్పోనున్నారు. జపాన్ ప్రిన్స్ ముమిహిటో కుమార్తె అయిన మాకో, తన క్లాస్‌మేట్ కీ కొమురోను అక్టోబర్ 26న రిజిస్టర్ మేరేజ్ చేసుకోనున్నట్లు ఏజెన్సీ తెలిపింది.

తర్వాత వారు ఒక మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారని తెలిపింది. అయితే వివాహం అనంతరం ప్యాలెస్‌లో ఎటువంటి విందు కాని ఉత్సవాలు కాని నిర్వహించబోరని, ఈ ఏడాది చివరిలో కొత్త జంట న్యూయార్క్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుందని ఏజెన్సీ వివరించింది. రాజవంశాన్ని వీడుతున్నందుకు మాకోకు దక్కవలసిన 15 కోట్ల యెన్(13.50 లక్షల అమెరికన్ డాలర్ల) ఆమెకు లభించవని, ఒక సామాన్యుడిని పెళ్లి చేసుకుంటున్నందుకే ఆమెకు కుటుంబ ఆస్తి దక్కడం లేదని ఏజెన్సీ చెప్పింది. 29 ఏళ్ల మాకో టోక్యో ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీలో చదువుకుంటున్నపుడు తన క్లాస్‌మేట్ కొమురోతో ప్రేమలో పడ్డారు. తామిద్దరం వివాహం చేసుకుంటున్నట్లు 2017 సెప్టెంబర్‌లో వారిద్దరూ ప్రకటించార. కాని కొమురో తల్లికి సంబంధించిన ఆర్థిక వివాదం బయటపడడంతో వారి వివాహానికి రాజకుటుంబం అనుమతించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News