Wednesday, May 1, 2024

షర్మిలకు 5% ఓట్లు కూడా పడవు

- Advertisement -
- Advertisement -

రాజన్న రాజ్యం తెలంగాణలో అవసరం లేదు

షర్మిల వెనక ఓ జాతీయ పార్టీ హస్తం ఉంది 
రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింది 
లీడర్లు వేరే దారి చూసుకోవాల్సిందే, తల్లిలాంటి పార్టీ నష్టపోవడం బాధాకరం
జగన్‌కు, విజయసాయి రెడ్డికి లారీల్లో నోటీసులు ఇవ్వాలి
అసెంబ్లీ సిఎల్‌పిలో జెసి దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో నూతన పార్టీ పెట్టి పోటి చేస్తే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో షర్మిలకు 5 శాతం ఓట్లు కూడా రావని మాజీ మంత్రి జే.సి దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె వెనక ఓ జాతీయ పార్టీ హస్తం ఉందని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆమె మొండి, పట్టుదల మనిషి అయినప్పటికీ ఇప్పటికిప్పడు ప్రజలు విశ్వసించే నమ్మకం లేదన్నారు. అదే విధంగా పదే పదే రాజన్న రాజ్యం అన్ని ప్రస్తావించడం హస్యస్పదంగా ఉందన్నారు. అసలు తెలంగాణలో రాజన్న రాజ్యం అవసరం లేదని ఆయన కొట్టిపరేశారు. కానీ ఏపిలో చాలా అవసరం ఉందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఆమె తెలంగాణలో పార్టీ పేరుతో ప్రాక్టీస్ చేస్తుందని, ఏడాదిన్నర త ర్వాత కచ్చితంగా ఏపికి వెళ్లిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు.ఆమెకు జగన్ ఏదో ఒక పదవి ఇస్తే కానీ సొంత పార్టీ ఆలోచనపై పునరాలోచనకు వస్తుందన్నారు. నూతన పార్టీ విషయంలో వాళ్ల అమ్మ(విజయ) చెప్పినప్పటికీ షర్మిల వినే పరిస్థితి లేదన్నారు. అసెంబ్లీ సిఎల్‌పి కార్యాలయంలో మంగళవారం జే.సి తెలంగాణ కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు బట్టి విక్రమార్క, రాజగోపాల్‌రెడ్డి, ఎంఎల్‌సి జీవన్‌రెడ్డిల సమక్షంలో మీడియా చిట్ చాట్ నిర్వహించారు.

ఈ సందర్బంగా జే.సి దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ..“తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాదన్నారు. రాష్ట్రాలను వేర్వేరు చేయడంతో కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల నష్టపోయిందన్నారు. కావున కాంగ్రెస్ నేతలంతా కూర్చోని ఏడిస్తే లాభం లేదని తేల్చిచెప్పారు. కచ్చితంగా వేరే దారి చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని, ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది, ఈక్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ ఎక్స్‌ఫైర్ అయిందన్నారు. రాయల తెలంగాణ వచ్చి ఉంటే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ప్రత్యేకమైన ఆధరణ ఉండేదన్నారు. ఆ సమయంలో తాను ఎంత మొత్తుకున్న మద్ధతు ఇవ్వలేదన్నారు. జయపాల్ రెడ్డి కూడా చివరి వరకు తనతో ఉండి ప్లేట్ పిరాయించాడన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం చాలా మంది బడా లీడర్లు స్వలాభం కొరకు పార్టీకి నష్టం చేకూర్చారన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి అర్హతలు లేకపోయినా అదృష్టవషాత్తు సిఎం అయి ఆగంఆగం చేసిండన్నారు. ఇప్పుడు ఏం చేసినా లాభం లేదని తెలిపారు. అదే విధంగా ఇప్పుడు రాయల తెలంగాణ అడిగిన నడపడానికి ఆర్ధిక వనరులు లేవని ఆయన వివరించారు.
జగన్‌కు, విజయసాయిరెడ్డికి లారీల్లో నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది..
ఏపి సిఎం జగన్, విజయసాయిరెడ్డిలకు నోటీసులు లారీల్లో ఇవ్వాల్సి వస్తుందని జేసి ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు ఇన్ని రోజుల సమయం పట్టిందంటే పరిస్థితులు అర్ధం అవుతున్నాయన్నారు. తెలంగాణ కంటే ఏపిలోనే దుర్మార్గపు పాలన కొనసాగుతుందని తెలిపారు. అయితే ప్రాంతీయ పార్టీల కంటే జాతీయ పార్టీలే చాలా మేలని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అప్పట్లో జానారెడ్డిని సిఎం చేసి ఉంటే పరిస్థితి వేరే ఉండేది…ఎంఎల్‌ఏ రాజగోపాల్‌రెడ్డి
కిరణ్‌కుమార్‌రెడ్డిని సిఎం చేసిన సమయంలో జానారెడ్డిని చేయాలని తామంతా ఎంత ప్రాదేయపడినా హై కమాండ్ తమ మాట వినలేదని ఎంఎల్‌ఏ రాజగోపాల్‌రెడ్డి అన్నారు. కేవలం జగన్‌ను తొక్కేందుకే ఆ సమయంలో కిరణ్‌కుమార్‌ని సిఎం చేశారన్నారు. అయితే ప్రస్తుతం టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు తాము ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు.

JC Prabhakar Reddy comments on Sharmila Party

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News