Tuesday, May 14, 2024

ఆగస్టు 23న జెఇఇ అడ్వాన్స్‌డ్

- Advertisement -
- Advertisement -

JEE Advanced Exam 2020 held on August 23

మనతెలంగాణ/హైదరాబాద్: జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ ఖరారైంది. ఆగస్టు 23వ తేదీన జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ గురువారం వెల్లడించారు. దేశంలోని 23 ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఢిల్లీ ఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీ-డీ) జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహించనుంది. మొట్టమొదటిసారిగా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష ద్వారా దేశంలోని 23 ఐఐటీల్లో ప్రవేశం కల్పించనున్నారు.

జెఇఇ మెయిన్స్ నుంచి గతంలో కంటే ఈ సారి 10 వేల మందిని ఎక్కువగా తీసుకోనున్నారు. జెఇఇ అడ్వాన్స్‌కు అన్ని కేటగిరీలతో కలిపి 2.50 లక్షల మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. జులై 18 నుంచి 23 వరకకు జెఇఇ మెయిన్, జులై 26న నీట్ పరీక్షల తేదీలను ఇటీవల ప్రకటించగా, తాజాగా జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీని ప్రకటించారు. కరోనా వైరస్‌వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా వివిధ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో పరీక్షల తేదీల విషయంలో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. వాస్తవానికి ఏప్రిల్‌లో జెఇఇ మెయిన్స్, మే 3వ తేదీన నీట్, మే 17న జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షలు జరగాల్సి ఉండగా, లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి.

JEE Advanced Exam 2020 held on August 23

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News