Saturday, April 27, 2024

నేటి నుంచి జెఇఇ మెయిన్ పరీక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యే జెఇఇ మెయిన్ 2023 తొలి విడత పరీక్ష మంగళవారం ప్రారంభం కానుంది. ఈ నెల 24, 25, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరిగే ఈ పరీక్షల కోసం సన్నద్ధమైన విద్యార్థులు https://jeem ain.nta.nic.in/ నుంచి తమ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) తెలిపింది. బిఇ,బి.టెక్ విభాగాల్లో జెఇఇ మెయిన్ తొలి విడత పరీక్ష (పేపర్ 1, రెండు షిఫ్టుల్లో)నిర్వహించనున్నట్టు తెలిపింది. అలాగే, ఈ నెల 28న బి.ఆర్క్, బి.ప్లానింగ్ విభాగంలో పేపర్ -2ఎ, 2బి పరీక్ష మధ్యాహ్నం షిఫ్ట్ జరుగుతుందని పేర్కొంది. 24,25 తేదీలలో పరీక్ష జరిగిన అనంతరం మూడు రోజుల తర్వాత పరీక్షల జరగనుంది. దేశవ్యాప్తంగా మొత్తంగా 290 నగరాల్లో, దేశం వెలుపలి 25 నగరాల్లో జెఇఇ మెయిన్ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఎన్‌టిఎ స్పష్టం చేసింది.
విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు
విద్యార్థులు పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు కచ్చితంగా అడ్మిట్ కార్డును తమ వెంట తీసుకొని వెళ్లాలి. పరీక్ష రాసే విద్యార్థులు తమ ధ్రువీకరణను నిర్ధారించే ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులను తీసుకెళ్లడం తప్పనిసరి. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా 12వ తరగతి అడ్మిట్ కార్డు, అభ్యర్థి ఫొటో ఉన్న బ్యాంకు పాసు పుస్తకం.. వీటిలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. అలాగే పాస్‌పోర్టు సైజ్ ఫొటోను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లడం మరిచిపోవద్దు. దరఖాస్తు చేసినప్పుడు అప్‌లోడ్ చేసిన ఫొటోను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే దాన్ని అటెండెన్స్ షీట్‌లో అతికించాల్సి ఉంటుంది. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే బాల్‌పాయింట్ పెన్ను తీసుకెళ్లాలి. వికలాంగులైన విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు తమ వెంట మెడికల్ ఆఫీసర్ ద్రువీకరించిన సర్టిఫికెట్‌ను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
వీటిని అనుమతించరు
చిరుతిళ్ళు, జామెట్రీ/ పెన్సిల్ బాక్స్, హ్యాండ్ బ్యాగ్, పర్సు, పేపర్లు/స్టేషనరీ, ప్రింటెడ్ మెటీరియల్, వాటర్ బాటిళ్లు, మొబైల్‌ఫోన్/ఇయర్ ఫో న్/మైక్రోఫోన్/పేజర్, కాలిక్యులేటర్, డాక్యుపె న్, కెమెరా, టేపు రికార్డర్ వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు/గ్యాడ్జెట్లు/పరికరాలను పరీక్ష కేం ద్రంలోకి అనుమతించరు. వీటితో పాటు హ్యాండ్ బ్యాగులు, పర్సులు, నగలు, మెటాలిక్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి నిషేధం. మధుమేహంతో బాధపడే విద్యార్థులైతే షుగర్ టాబ్లెట్స్/పండ్లు వంటివి వెంట తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News