Saturday, May 4, 2024

5న జెఇఇ, 6న ఎంసెట్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -
JEE on 5th and EAMCET results on 6th

 

తుది కీ తో పాటే ర్యాంకుల
వెల్లడి ఆ తర్వాత రోజు
నుంచే కౌన్సెలింగ్ ప్రక్రియ

మనతెలంగాణ/హైదరాబాద్ : జెఇఇ అడ్వాన్స్‌డ్-2020 ఫలితాలు అక్టోబర్ 5వ తేదీన విడుదల కానున్నాయి. ఈ మేరకు ఐఐటి ఢిల్లీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 27వ తేదీన నిర్వహించిన జెఇఇ అడ్వాన్స్‌డ్ తాత్కాలిక కీ ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. దీనిపై గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అక్టోబర్ 5వ తేదీన జెఇఇ అడ్వాన్స్‌డ్ తుది కీ తోపాటు ర్యాంకులను వెల్లడించనున్నారు. దేశవ్యాప్తంగా గత ఆదివారం జరిగిన జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షకు 2.50 లక్షల మంది అర్హత సాధించినా 1.60 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 222 పట్టణాల్లో 1,001 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలను నిర్వహించారు. జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు 96 శాతం హాజరు నమోదైనట్లు ఐఐటి ఢిల్లీ వెల్లడించింది. ఉదయం జరిగిన పేపర్- 1 పరీక్షకు 1,51,311 మంది విద్యార్థులు హాజరుకాగా, మధ్యాహ్నం జరిగిన పేపర్ – 2 1,50,900 మంది హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 30 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరైనట్టు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణలో 15 పట్టణాల్లో, ఆంధ్రప్రదేశ్‌లో 30 చోట్ల ఈ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

6 నుంచి కౌన్సెలింగ్

దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటి, ఎన్‌ఐటి, ట్రిపుల్‌ఐటి, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే ఇతర విద్యా సంస్థల్లో (జిఎఫ్‌టిఐ) ప్రవేశాల కోసం ఉమ్మడి కౌన్సెలింగ్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. మే 27న జరిగే జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలను అక్టోబర్ 5వ తేదీన ఫలితాలను ఐఐటీ ఢిల్లీ ప్రకటించనుండగా, ఆ తర్వాత రోజు నుంచే కౌన్సెలింగ్ చేపట్టేందుకు జోసా చర్యలు చేపట్టింది. ప్రవేశాల ప్రక్రియ ఈ సారి ఆలస్యమైనందున ఈ సారి ఒక విడతను తగ్గించారు. ఈ సారి ఆరు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు

6న ఎంసెట్ ఫలితాలు

ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు ఈ నెల 6వ తేదీన ప్రకటించనున్నారు. ముందుగా 5న విడుదల చేయాలని భావించినా అదేరోజు జెఇఇ అడ్వాన్స్‌డ్ ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ఒక రోజు తర్వాత అంటే 6వ తేదీన ఎంసెట్ ర్యాంకులు విడుదల చేస్తామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి. పాపిరెడ్డి తెలిపారు. ఈ పరీక్షకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 1,43,165 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,19,187 మంది హాజరయ్యారు. కోవిడ్- 19 మార్గదర్శకాలను అనుగుణంగా ఈ నెల 9,10,11, 14 తేదీలలో రోజుకు రెండు విడతలుగా ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో 79 పరీక్షా కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్‌లో 23 పరీక్షా కేంద్రాలలో ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ ని సెప్టెంబర్ 18న విడుదల చేసి, 20వ తేదీ వరకు ప్రాథమిక కీ పై అభ్యంతరాలు స్వీకరించారు.యుజిసి మార్గదర్శకాల ప్రకారం నవంబరు 1 నుంచి ఇంజనీరింగ్, ఫార్మసీ తరగతులు ప్రారంభించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నెల మొదటి వారం లేదా రెండవ వారంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభించి, ఈ నెలాఖరులోగా పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

3న కోవిడ్ బాధితులకు పరీక్ష

ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు జరిగిన సమయంలో కోవిడ్ 19తో బాధపడిన సుమారు 53 మంది విద్యార్థులకు ఈ నెల 3వ తేదీన జెఎన్‌టియుహెచ్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. అదేరోజు మరో ముగ్గురు ఇసెట్ విద్యార్థులకూ పరీక్ష ఉంటుంది. మిగిలిన పరీక్షల సమయంలోనూ బాధిత విద్యార్థులుంటే ప్రత్యేకంగా నిర్వహించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News