Friday, April 26, 2024

యేసు క్రీస్తు చూపిన మార్గాలు అనుసరణీయం

- Advertisement -
- Advertisement -

ప్రతి వ్యక్తికి ప్రేమానురాగాలు పంచేది క్రిస్మస్
జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్
క్రైస్తవుల అభ్యున్నతికి కృషి చేస్తున్నది తెలంగాణ సిఎం కెసిఆర్
ఎమ్మెల్సీ రాజేశ్వరరావు

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్: మానవాళికి యేసుక్రీస్తు చూపిన కరుణ, ప్రేమ, దయ మార్గాలు ఎప్పటికి ప్రతి వ్యక్తికి అనుసరణీయమని జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని డికెఆర్ గార్డెన్‌లో జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ తరపున నిర్వహించిన సెమి క్రిస్‌మస్ వేడుకల్లో  క్రిస్‌మస్ కేక్‌ను కలెక్టర్ కట్ చేశారు. జిల్లా కలెక్టర్ శర్మన్ క్రిస్‌మస్ సోదరులకు క్రిస్మస్ శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ… ప్రపంచ మానవాళి శాంతి, సంతోషాల కోసం క్రీస్తు చూపిన కరుణ, దయ, ప్రేమను అందరికి పంచాలని వారు చూపిన మార్గంలో ప్రయాణించాలన్నారు. అందరి సుఖసంతోషాలు సమాజ అభివృద్ధికి దోహదమని అన్నారు. క్రీస్తు ప్రవచించిన విధంగా తోటివారికి సహాయ పడడంలోనే దైవత్వం ఉందని తెలిపారు. సమాజంలో ఆయన చూపిన కరుణ, జాలి, ప్రేమ వర్గాన్ని అందరు అనుసరించాలన్నారు. తోటి వారి పై గౌరవం దయ కల్గి ఉండాలని కలెక్టర్‌కు సూచించారు.

క్రిస్టియన్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు మాట్లాడుతూ… అన్ని వర్గాల పేదలకు ఏ రాష్ట్రంలో జరగని విధంగా సంక్షేమ కార్యక్రమాలను పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలంగాణలో అమలు పరుస్తున్నామని తెలిపారు. ప్రతి క్రైస్తవుడు ఏసు చూపిన మార్గంలో పయనించి సమాజంలో మంచి వ్యక్తులుగా రాణించడమే కాకుండా తోటివారిని సన్మాన మార్గంలో నడిపించడమై నిజమైన క్రైస్తవుడన్నారు.  జిల్లా కలెక్టర్ నేటి సెమి క్రిస్మస్ వేడుకలకు హాజరు కావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

జిల్లా మైనార్టీ అధికారి అనిల్‌ప్రకాష మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం క్రిస్‌మస్ పండుగ సందర్భంగా నియోజకవర్గానికి వేయి చొప్పున జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు నాలుగువేల గిఫ్ట్‌లను పంపిణి చేయడం జరుగుతందని తెలిపారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గ క్రిస్మస్ సోదరులకు శుక్రవారం మద్యాహ్నం 2.30 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్రి జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణి చేయనున్నట్లు తెలిపారు.  గురువారం జిల్లా కేంద్రంలోని డికెఆర్ గార్డెన్‌లో జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ తరపున నిర్వహించిన సెమి క్రిస్‌మస్ వేడుకల్లో జిల్లా కలెక్టర్ శర్మన్, క్రిస్టియన్ ఎమ్మెల్సీ రాజేశ్వర రావు, జిల్లా మైనార్టీ ఆఫీసర్ అనిల్ ప్రకాష్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు జైలూయిస్ స్టిల్లా, పాస్టర్స్ జిల్లా అధ్యక్షులు పాల్‌రాజు, క్రిస్మస్ గిఫ్ట్ పంపిణి అధ్యక్షులు సంపత్, డిప్యూటి తహసీల్దార్ ఖాజా, పాస్టర్లు క్రిస్టియన్ సోదరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News