Friday, April 26, 2024

జూవెల్లరీ షాపు బంగారం దొంగల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Jewelry Shop Gold Thieves Arrested in Hyderabad

హైదరాబాద్: నీటిలో కొట్టుకుపోయిన బంగారు ఆభరణాలను కొట్టేసిన వారిని నగర పోలీసులు అరెస్టు చేశారు. నలుగురుని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 125తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నూలు జిల్లా, ఆమ్రబాద్ మండలం, తుర్కపల్లికి చెందిన గొవటి నిరంజన్ నగరంలోని బంజారాహిల్స్, కంగార్ కిడ్స్ పాఠశాల ఎదురుగా గుడిసెలో ఉంటు కూలీ పనిచేస్తున్నాడు, రంజిత్‌కుమార్, పెద్దకొత్తపల్లి మండలం, ముస్టిపల్లికి చెందిన పవనం బాలాపీర్ తాపీమేస్త్రీ,బాల్‌మూర్ మండలం, గోడల్ గ్రామానికి చెందిన వెంకటయ్య ఎసిహెచ్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు.

మరో నిందితుడు కుమార్ రాజారాం పరారీలో ఉన్నారు. బషీర్‌బాగ్, లిబర్టీ క్రాస్ రోడ్డులోని విఎస్ గోల్డ్ జువెల్లరీ షాపు యజమాని అజయ్‌కుమార్ అగర్వాల్ ఈనెల 9వ తేదీన సాయంత్రం సేల్స్ ఎగ్జిక్యూటీవ్ ప్రదీప్‌కుమార్‌ను జూబ్లీహిల్స్, రోడ్డు నంబర్ 36లోని కృష్ణ జూవెల్లర్స్, పిరల్స్ అండ్ జెమ్స్‌లో స్టాక్ తెచ్చేందుకు బైక్‌పై పంపించాడు. ఎగ్జిక్యూటివ్ అక్కడి నుంచి 143తులాల బంగారు ఆభరణాలు తీసుకుని సాయంత్రం 7గంటలకు బైక్‌పై తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్, రోడ్డు నంబర్ 3లోని కంగారు కిడ్స్ పాఠశాల వద్ద బైక్‌కు రోడ్డుప్రమాదం జరగడంతో బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగు, అందులోని మొబైల్ ఫోన్ నీటిలో కొట్టుకుపోయింది.

బ్యాగు నీటిలో కొట్టుకుపోవడంతో ప్రదీప్ కుమార్ కేకలు వేశాడు. కేకలు విన్న నిరంజన్ బ్యాగును తన గుడిసె సమీపంలో వెతికాడు. తనకు నగలు ఉన్న బ్యాగు లభించినా కూడా బాధితుడికి చెప్పలేదు. నిరంజన్‌కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి వాటిని తీర్చుకోవాలని ప్లాన్ వేశాడు. ఇంటి నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో నగలు అమ్మి దానిని పూర్తి చేయాలని ప్లాన్ వేశాడు. ఈ విషయం తన కుమారుడు రంజిత్‌కుమార్‌కు తెలిపాడు. ఇద్దరు కలిసి స్క్రాప్‌ను ఎరుకుని వచ్చి విక్రయించేవారు. ముగ్గురు నిందితులు కలిసి బంగారు ఆభరణాలు తీసుకుని తమ బంధువు వెంకటయ్య ఉంటున్న ఎల్లమ్మబండలోని ఇంటికి వెళ్లారు. నిరంజన్ బ్యాగులో ఉన్న మొబైల్ ఫోన్‌ను రిపేర్ చేసేందుకు జగదీర్‌గుట్టలోని ఓ మొబైల్ షాపులో ఇచ్చారు. 18తులాల బంగారు ఆభరణాలను రోడ్డు మీద వెళ్తున్న వారికి విక్రయించారు. వచ్చిన డబ్బులతో అందరు కలిసి జల్సాలు చేశారు. బంజారాహిల్స్ డిఐ ఎండి హఫీజుద్దిన్, ఎస్సై భరత భూషన్ తదితరులు నిందితులను పట్టుకున్నారు.

మొబైల్ ఫోన్ పట్టించింది….

నిందితులను బంగారు ఆభరణాల బ్యాగులో ఉన్న మొబైల్ ఫోన్ పట్టించింది. నిందితులు వర్షానికి తడిసిన మొబైల్ ఫోన్‌ను రిపేరు చేయించేందుకు మొబైల్ షాపుకు వెళ్లారు. అక్కడ ఫోన్‌ను స్విచ్ ఆన్ చేయడంతో పోలీసులు అక్కడి లొకేషన్‌ను ట్రేస్ చేశారు. స్థానికంగా ఉన్న సిసి కెమెరాల ఫుటేజ్‌ను సేకరించి నిందితులను గుర్తించారు. ఎల్లమ్మబండలో నిందితులు ఉండగా పోలీసులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News